బాలీవుడ్ సినిమా పరిశ్రమకి తొలిసారిగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన కహోనా ప్యార్ హై సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ అమీషా పటేల్. అంతకముందు మోడల్ గా మెరిసిన ఈ భామ తొలి సినిమాతోనే అతి పెద్ద విజయాన్ని కైవశం చేసుకుని విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆమెకి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి మూవీలో ఛాన్స్ వచ్చింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెబ్యూ మూవీగా రూపొందిన బద్రి అప్పట్లో సూపర్ హిట్ కొట్టి, ఇటు తెలుగులో కూడా అమీషా కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

అనంతరం కొంత గ్యాప్ తరువాత ఆమె సూపర్ స్టార్ మహేష్ తో కలిసి చేసిన సినిమా నాని. ఎస్ జె సూర్య తీసిన ఈ మూవీ ఫెయిల్ అయింది. ఆపైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన నరసింహుడు మూవీ కూడా ఫ్లాప్ కావడం, ఆ తరువాత బాలయ్య తో వర్క్ చేసిన పరమవీర చక్ర మూవీ కూడా బోల్తా కొట్టడంతో తెలుగులో అమీషా కి ఆపైన అవకాశాలు రాలేదు. ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ కె పరిమితం అయిన అమీషా ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇక మొదటి నుండి కూడా తన ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ పెట్టె అలవాటు గల అమీషా పటేల్, పక్కాగా డైట్ ఫాలో అవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తూ ఉంటారు.

 

ఇక ఆమెకు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే విషయం ఏమిటంటే, తన ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపుతూ, లేటెస్ట్ ట్రెండీ స్టైల్ డ్రెస్ లో మరింత యుంగ్, స్లింగ్ గా మారిన అమీషా తన ట్విట్టర్ అకౌంట్ లో మొన్న పోస్ట్ చేసిన చిన్న వీడియో రీల్ ఎంతో వైరల్ అవుతోంది. రోజులు గడిచేకొద్దీ అమీషా అందం మరింతగా పెరుగుతోందని, అలానే త్వరలో ఆమెకు ఇటు తెలుగులో కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ పలువురు తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి ముగ్ధులు అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తెలుగు దర్శకనిర్మాతలు ఆమెకు రాబోయే రోజుల్లో ఎంత మేర ఛాన్స్ లు ఇస్తారో తెలియాలి అంటే కాలమే దానికి సమాధానం చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: