గత ఏడాది నుండి దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ మహమ్మారి కారణంగా నానా ఇబ్బందులు పడిన తెలుగు సినిమా పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న సమయంలోనే కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఇండస్ట్రీలో విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ మళ్ళి వాయిదా పడ్డాయి. అయితే ఈ ఏడాది చాలా సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కించారు.

ఇక ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా కూడా మల్టీ స్టారర్ గా చిత్రీకరించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగ చైతన్య కలిసి నటించిన విషయం తెల్సిందే.

అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మల్టీ స్టారర్ సినిమానే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ కలిసి నటించారు. ఈ చిత్రాన్ని ఫిక్షనల్ పీరియడ్ డ్రామాగా  తెరకెక్కించారు. దీనిని మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న జనాల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక  మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

అంతేకాదు.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనున్ కోషియం సినిమాకు రీమేక్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా.. ఫిబ్రవరి 25న విడుదల చేయనునట్లు తెలుస్తోంది. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ఎఫ్-3. ఈ సినిమాను ఎఫ్-2కు సీక్వెల్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: