ఇక మరోవైపు సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం గాలోడు అనే సినిమాలో నటిస్తున్నాడు సుడిగాలి సుదీర్. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ మాస్ లుక్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇక పోతే ఇప్పుడు సుడిగాలి సుదీర్ మాస్కోలో దర్శనమిచ్చాడు. ఇటీవలే ఇంస్టాగ్రామ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే సుధీర్ పక్కన సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం.
ఇలా సుధీర్ ప్రకాష్ రాజ్ మాస్కో లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే మా ఎలక్షన్ సమయం లో ప్రకాశ్ రాజ్ కి మద్దతు పలికాడు సుడిగాలి సుధీర్. అప్పటి నుంచి ఆ టీమ్ వెంటే నడుస్తున్నాడు. ఇక ఇప్పుడు వీరిద్దరూ మాస్కోలో ఎందుకు ఉన్నారు అన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది. గాలోడు సినిమా సాంగ్స్ షూటింగ్ ఉండడం వల్లే సుదీర్ మాస్కో కి వెళ్ళాడు అంటూ కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు. లేదు ఏదైనా కొత్త సినిమా షూటింగ్ కోసం ప్రకాష్ రాజు సుడిగాలి సుదీర్ మాస్కో వెళ్లారా అన్న చర్చ కూడా మొదలైంది.