బాహుబలి'(సిరీస్) తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుండీ వచ్చిన మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. ఇద్దరు బడా స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ లు ఈ మూవీలో నటించి మెప్పించారు.


దీంతో సినిమా షూటింగ్ ఆరంభ దశ నుండే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.. లేట్ అయ్యే కొద్దీ సినిమా పై భారీ అంచనాలు కూడా పెరిగాయి.'బిగ్గర్ దేన్ బాహుబలి' అంటూ రాజమౌళి విడుదలకి ముందు ఇచ్చిన హై కూడా ఓ రేంజ్లోనే వర్కౌట్ అయ్యింది.


కానీ సినిమా 'బాహుబలి2' కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ల క్రేజ్ తో ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.దాదాపు రూ.1150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను అయితే సాధించింది. ఇటీవల ఈ చిత్రం ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో మళ్ళీ ప్రేక్షకులు ఈ మూవీని స్మాల్ స్క్రీన్స్ లో కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


 


అయితే సోషల్ మీడియాలో కోడిగుడ్డు మీద ఈకలు వెతికే రకాల జనాలు కొంతమంది ఉంటారన్న విషయం తెలిసిందే. వాళ్ళు ఆర్.ఆర్.ఆర్ మూవీకి రోజుకో వంక పెడుతున్నారట. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వాడిన బైక్ కు రెండు రకాల నెంబర్లు ఉన్నాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు.. ఇప్పుడు వాళ్ళు ఇంకో మిస్టేక్ ను కూడా కనిపెట్టి తెగ వైరల్ చేస్తున్నారు. అదేంటి అంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా మోరిస్ కు… అలాగే చరణ్, ఎన్టీఆర్ లకు మధ్య ఓ సన్నివేశం ఉంటుందట.


 


ఈ సీన్ బ్యాక్ గ్రౌండ్లో తారక్ అని ఎవరో పిలుస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. థియేటర్ లో చూసినప్పుడు బహుశా దీనిని ఎవరూ కూడా గమనించి ఉండకపోవచ్చు. కానీ ఓటిటిలోకి వచ్చేసరికి ప్రేక్షకులు రిపీట్స్ చూస్తారు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అయితే బయటపడతాయి.బహుశా ఎడిటింగ్ లోపం అని కొంతమంది అంటుంటే, 'అన్నేళ్ళు తీసావ్ కదా చూసుకోలేదా రాజమౌళి' అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారట.మరో సన్నివేశంలో అయితే పులి, నక్కలు ఒకే చోట ఉన్నాయని . అలా ఎలా కలిసున్నాయి.. పులి వాటిని చంపేయదా అని కూడా అంటున్నారట.మరింత సమాచారం తెలుసుకోండి: