విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు నార్త్ లో పలు నగరాలలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ దృష్టి పెట్టిన రౌడీ ఇప్పుడు సౌత్ పై దృష్టి పెట్టబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే సౌత్ లో ఆయన చేయబోయే ప్రమోషన్ కార్యక్రమాల యొక్క వివరాలను వెల్లడించింది. వరంగల్లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చేస్తున్న చిత్ర బృందం ఆ తరువాత గుంటూరులో కూడా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ను చేయబోతుంది.

ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా యొక్క సందడి మరొకసారి మొదలు కాబోతోంది. హైదరాబాదులో కూడా ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఆ విధంగా ఈ సినిమాను వేరే స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రాబోతూ ఉండడం విశేషం. అన్ని భాషలలోనూ ఈ సినిమా విడుదల కాబోతూ ఉండగా ప్రధానంగా తెలుగులో ఈ చిత్రం భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దానికి కారణం విజయ్ దేవరకొండ గత సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో ఎన్నో విమర్శల పాలయ్యాడు. ఆ విమర్శకులు అందరినీ నోళ్లు ముగించాలంటే తప్పకుండా ఈ సినిమా ద్వారా ఆయన భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమోషన్స్ సమయంలో తనదైన మార్క్ చూపించే విజయ్ దేవరకొండ ఈసారి అదే స్థాయిలో తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఏకాకిగా ఈ సినిమాకు అన్ని తానై ముందు ముందుకు వెళుతున్నాడు. మరి ఆయన కష్టానికి ఫలితంగా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా వేల ధియేటర్లలో విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: