స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో అపరిచితుడు కూడా ఒకటి. విక్రమ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా విడుదలై తాజాగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళంలో ఈ సినిమా అన్నియన్ అనే టైటిల్ తో విడుదలైంది.

అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా 26 కోట్ల రూపాయల బడ్జెట్ తో  తెరకెక్కింది.  శంకర్ ఈ   సినిమాకు  డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా  సుజాత రంగనాథన్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.  ఒకే మనిషి ముగ్గురిలా కనిపించే సరికొత్త కాన్సెప్ట్ తో  తెరకెక్కిన  ఈ సినిమా  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఏకంగా 37 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అపరిచితుడు పబ్లిక్ తో మాట్లాడే సన్నివేశాన్ని షూట్ చేశారు.  శంకర్ ఈ కథను మొదట రజనీకాంత్ కు వినిపించగా ఆయన నో  చెప్పడంతో  విక్రమ్ ఈ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.  హీరో  విక్రమ్ భార్య శైలజ సైకియాట్రిస్ట్  కాగా  ఈ సినిమా కోసం విక్రమ్ ఆమె సలహాలు తీసుకున్నారు. ఐశ్వర్యారాయ్,  సిమ్రాన్ ఈ సినిమాకు నో చెప్పడంతో సదా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.  ఈ సినిమాకు  హరీష్  జైరాజ్ మ్యూజిక్ అందించారు.

ఫ్రెంచ్ భాషలో విడుదలైన తొలి  సౌత్ సినిమా అపరిచితుడు కావడం  గమనార్హం. ఈ సినిమాలోని ఒక ఫైట్  సీన్ కోసం ఏకంగా 120 కెమెరాలను ఉపయోగించారు.  2005 సంవత్సరం జూన్ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.  లంచం, నిర్లక్ష్యం  లేని సమాజం  కోసం  అపరిచితుడు పోరాడగా నేటికీ సమాజంలో మార్పు అయితే రాలేదని   కామెంట్లు వ్యక్తమవుతు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: