
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అవ్వడానికి తమిళ్ హీరో అయినా తన సినిమాలు ఇటీవల కాలంలో తమిళ్ వెర్షన్ కంటే మన తెలుగు వెర్షన్ లోనే బాగా ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన సార్ సినిమాకు కోలీవుడ్ లో తమిళ వెర్షన్ కంటే తెలుగులో నే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. సార్ తెలుగులో వీరవిహారం చేసింది. ఇక ఇప్పుడు కుబేర సినిమా విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ - నాగార్జున తో పాటు రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు.
ఇక కుబేర ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కుబేర యూఎస్ మార్కెట్ లో తెలుగు వసూళ్లు తమిళ్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పుడు వరకు తమిళ్ వెర్షన్ కి లక్ష డాలర్స్ గ్రాస్ కూడా దాటలేదంటే ఈ సినిమాకు తమిళంలో కంటే తెలుగులో క్రేజ్ ఎక్కువ అని తెలుస్తోంది. కుబేర తెలుగు వెర్షన్ కు 3 లక్షల 27 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు కొల్లగొట్టగా ... ఇది 5 లక్షల డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. మరి తమిళ్ వెర్షన్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లుతో ఆ డామినేషన్ ఎలా ఉందో తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు