మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లో రావాల్సి ఉంది. అంతేకాదు ఏప్రిల్ లో సినిమా విడుదల కాబోతుంది అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ సడన్ గా ఈ సినిమా వాయిదా పడింది.అలా చివరికి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో రావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే గతంలో డైరెక్టర్ సీన్స్ సరిగ్గా చేయలేదని, మళ్లీ రీ షూట్ చేశారని కొన్ని రూమర్లు వినిపిస్తే.. విఎఫ్ఎక్స్ బాలేదని సినిమాని మళ్లీ రీ షూట్ చేశారు అనే రూమర్లు మరికొన్ని వినిపించాయి. అయితే తాజాగా తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రాజా సాబ్ ఆలస్యానికి కారణం ఎవరో పేరుతో సహా బయటపెట్టారు. ఇక రాజా సాబ్ ఆలస్యానికి కారణం ఎవరో కాదు విఎఫ్ఎక్స్ మేనేజర్ అంట. 

అయితే ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతనే బయటపెట్టారు.ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ది రాజా సాబ్ మూవీ ని ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నాము. కానీ తీరా సినిమాని విడుదల చేసే సమయంలో విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని డైరెక్టర్ కి అనిపించింది. దాంతో డైరెక్టర్ విఎఫ్ ఎక్స్ పట్ల నిరాశ చూపించి ఇదేంటి ఇలా చేశారు అని మేనేజర్ ని అడిగితే.. నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడి డైరెక్టర్ నే బెదిరించారు. అంతేకాదు డబ్బులు తీసుకొని మమ్మల్ని బెదిరించడంతో చేసేదేమీ లేక ఆ విఎఫ్ఎక్స్ మేనేజర్ ని మార్చేసి కొత్తవారిని పెట్టుకున్నాం. విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉండడం వల్లే ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయడం కుదరలేదు.

 అందుకే మళ్ళీ కొత్త విఎఫ్ఎక్స్ మేనేజర్ ని పెట్టుకొని  రీ షూట్ చేశారు అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. అలా విఎఫ్ఎక్స్ మేనేజర్ కారణంగానే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడ్డట్టు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇక రాజా సాబ్ మూవీ గురించి చూసుకుంటే. Mఈ సినిమా ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలినవి పాటలే. వీటిని కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇక దీ రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా విడుదల కాబోతోంది. ఇక సంక్రాంతి బరిలో పెద్దపెద్ద సినిమాలు రాబోతున్నాయి ప్రభాస్ కి కాబట్టి గట్టి పోటీ ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. మరి చూడాలి సంక్రాంతి కైనా రాజా సాబ్ ని తీసుకువస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: