సినిమా ఇండస్ట్రీలో ఎంతటి తోపు తురుము అనుకున్న వాళ్ళైనా కొంతకాలం పాటు
సక్సెస్ లేకుంటే.. మకిలం పట్టిన ఇనుములా తయారవుతారు. అందులో సందేహం లేదు.
అందుకే హిట్ కోసమే పనిచేస్తారు తప్పా ఎదో చేసామంటే చేశామనేలా చేయరు. అలా
చేస్తే వాళ్ళ కెరీర్ దెబ్బతింటుంది. హీరో అయినా హీరోయిన్ అయినా అంతే.
సినీ
ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. కాజల్
మాత్రం అందుకు మినహాయింపు అని చెప్పొచ్చు. సినిమాలు ప్లాప్ అయినా ఆమెకు
అవకాశలు వస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150 తరువాత ఆమెకు మంచి హిట్ లేదు. సీత
సినిమాపై ఆశలు పెట్టుకున్నా... అసలు సోదిలో లేకుండా పోయింది.
ఇప్పుడు
రణరంగం అనే సినిమా చేస్తోంది. శర్వానంద్ హీరో. కాజల్ మెయిన్ హీరోయిన్.
ఈ
సినిమా ఆగష్టు 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. రణరంగం ఫస్ట్ లుక్ టీజర్
మెప్పించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా హిట్
పైనే పాపం కాజల్ టాలీవుడ్ ఆశలు ఉంటాయి.
తెలుగులో
రణరంగం తప్పించి చేతిలో సినిమా లేదు. అయితే, తమిళంలో ప్యారిస్ ప్యారిస్,
కోమలి సినిమాలు ఉన్నాయి. తమిళంలో ఆమె ఈజీగా అవకాశాలు దక్కించుకుంటోంది.
ప్యారిస్ ప్యారిస్ తప్పకుండా హిట్ అవుతుంది. ఎందుకంటే క్వీన్ సినిమాకు అది
రీమేక్. తెలుగులోనే చూడాలి ఏమౌతుందో మరి.