దేశంలో ఎక్కడ చూసినా వారసుల హవా నడుస్తుంది..అది రాజకీయ రంగమే కావచ్చు..సిని పరిశ్రమే కావచ్చు..ఏదేమైనా తండ్రుల తర్వాత ఆ స్థానాల్లో కొడుకు భర్తీ చేస్తున్నారు. తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు మంత్రి పదవులు దక్కాయి. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్తో తలపండిన వ్యక్తిగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశాల్లో వార్తల్తో వక్తిగా యావత్ భారత దేశానికి సుపరిచితమే.

మొన్నజరిగిన బిహార్ ఎన్నికల్లో లాలూ సత్తా చాటారు.  నితీశ్ తన కేబినెట్‌లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి పెద్ద పీట వేశారు. లాలూ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. తొమ్మిదో తరగతి వరకు చదివిన తేజస్వీ యాదవ్.. క్రికెటర్‌గా రాణించాలని భావించారు. ఆ తర్వాత బీహార్ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. లాలు చిన్న కొడుకు తేజస్వి (26) డిప్యూటీ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్


భిహార్ ఎన్నికల్లో ఢంకా మోగించిన నితీష్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, రాజ్యసభ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తదితరులు వస్తున్నారు. ముఖ్యమంత్రుల్లో... మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, పికే చామ్లింగ్, సిద్ధరామయ్య, వీరభద్ర సింగ్, తరుణ్ గొగోయ్, ఇబోబిసింగ్, నబమ్‌తుకి తదితరులు హాజరు కానున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య, రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరవుతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: