ఉచిత విద్యుత్.. ఈపేరు వినగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు.. 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ను గద్దె ఎక్కించిన హామీల్లో ఇది ప్రధానమైంది. అప్పట్లో వైఎస్ ఈ హామీ ఇస్తే.. అధికార  తెలుగుదేశం ఎద్దేవా చేసింది.. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే.. అంటూ ఎగతాళి చేసింది. కానీ అదే వైఎస్ అధికారంలోకి రాగానే తన హామీని అమలు చేసి చూపించాడు.. అంతే కాదు.. మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైనే చేశాడు.

అప్పటి నుంచి అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ అమలవుతూనే ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలవుతూనే ఉంది. ఇప్పుడు కేంద్రం నిబంధనల ప్రకారం.. ఉచిత విద్యుత్ ఇస్తున్నా.. మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీని వల్ల రైతులకు పైసా కూడా భారం పడదని.. బిల్లు ప్రభుత్వమే కట్టుకుంటుందని ఏపీ సర్కారు క్లారిటీ ఇచ్చేసింది.

అయినా ఈ అంశంపై విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఇది క్రమంగా ఉచిత విద్యుత్ ఎత్తివేతకు దారి తీస్తుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. మంత్రి బొత్స మరోసారి ఈ విషయం స్పష్టత ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే.. ” ఆ దేవుడి చ‌ల్లని దీవెన‌ల‌తో..ప్రజ‌లంద‌రికీ ఆశీస్సుల‌తో మంచి కార్యక్రమాలు చేస్తున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతుంటారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల‌ను క‌చ్చితంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేరుస్తారు. రైతుల‌కు ప‌గ‌డ్బంధీగా ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. రాబోయే 30 ఏళ్ల‌లో రైతుల‌కు ఉచిత విద్యుత్ విష‌యంలో చిన్న ఇబ్బంది కూడా రాకుండా శాశ్వత‌మైన కార్యక్రమాల‌ను చేసే దిశ‌గా ఈ ప్రభుత్వం  ముంద‌డుగు వేస్తోంది అని తేల్చి చెప్పారు.


చంద్రబాబు ఎన్ని మాయ‌లు చేసినా న‌మ్మే ప‌రిస్థితిలో ప్రజ‌లు లేరన్న మంత్రి బొత్స ... మ‌హానేత వైయ‌స్ఆర్ ఆశ‌యంతో ఉన్న ఈ ప్రభుత్వంపై ప్రజ‌లు విశ్వాసంతో..న‌మ్మకంతో ఉన్నారన్నారు. ప్రజ‌ల న‌మ్మకాన్ని వ‌మ్ము చేయ‌కుండా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నారని.. వేలెత్తి చూపించుకునే ప‌రిస్థితి ఈ ప్రభుత్వానికి రాదని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి రైతే వెన్నుముక‌ అని..  రైతు క‌ళ్లలో ఆనందం కోసం ఈ ప్రభుత్వం ఎందాకైనా వెళ్తుందని బొత్స తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: