
1. బాదం పప్పు
బాదం పప్పులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఉదయం పూట నానబెట్టి సాయంత్రం సమయంలో బాదంపప్పు తినడం వలన ఆకలి తగ్గటంతో పాటు శక్తి కూడా లభిస్తుంది. బాదం పప్పులో అనేక రకాల ప్రొటీన్లు కూడా ఉండటంతో ఆరోగ్యం కూడా లభిస్తుంది.
2. ఆపిల్
ఆపిల్ తినడం వలన కాలుష్య కారకాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆపిల్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల త్వరగా కడుపు నిండినట్టుగా అనిపించడం తో పాటు శారీరక బరువు నియంత్రణలో ఉంటుంది.
3. వేరుశనగ పప్పు
కడుపు నిండిన అనుభూతి కలిగించడం లో చిరు తిండి అయిన వేరుశెనగపప్పు చాలా బాగా దోహదపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభించడంతో పాటు.. వాటిలో కేవలం 74 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా పెట్టిన విడుదల చేస్తాయి.
4. ద్రాక్ష పండ్లు
సాయంత్రం వేళ ఎక్కువగా ద్రాక్షపండ్లను తింటూ ఆకలి సమస్యను అధిగమించవచ్చు. 30 ద్రాక్ష పండ్లు ప్రతిరోజు సాయంత్రం పూట తినడం వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు అలసట కూడా తగ్గుతుంది. వీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉండటం వలన బరువు పెరగడం జరగదు.
5. టమాటా సూప్
స్నాక్స్ తినడం ఇష్టం లేకపోతే టమాటా సూప్ తాగొచ్చు. ఇందులో కూడా తక్కువ క్యాలోరిస్ ఉంటాయి కానీ బరువు పెరగరు. టమాటా సూప్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.