రానున్న రెండు రోజుల్లో దేశ రాజధాని చీకటి మయం కాబోతుందని ఆ రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలియ జేశారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రానికి సరైన బొగ్గు నిల్వలు లేకపోవడం. దేశ రాజధానిలో తీవ్రం గా విద్యుత్ సంక్షోభం నెలకొనడమే దీనికి ప్రధాన కారణం  కేంద్రం లోని మోడీ సర్కారు బాధ్యత రాహిత్యమే , కాబట్టి కేంద్రం  పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతం లో కూడా కోవిడ్ సెకండ్ వేవ్ నెలకొన్నప్పుడు కేంద్రం నుండి ఆక్సిజన్ సిలిండర్ లను కేంద్రం సమకూర్చలేక పోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన బొగ్గు వాటా కేంద్రం సమకూర్చలేక పోతోంది . దింతో ఢిల్లీ విద్యుత శాఖ మంత్రి కేంద్రం పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మూడు రేట్లు విద్యుత్తు ఉత్పత్తి  సామర్థ్యం ఉన్నా కూడా కేంద్రం తమకు బొగ్గు ని సమకూర్చలేక పోవడంతో విద్యుత్ ప్లాంట్స్ ని  నడపలేక పోతున్నామని  వాపోయారు.



 తమకు ఎక్కడా కూడా బొగ్గు నిల్వ ప్లాంట్లు కూడా లేవని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఇతర సంస్థలనుండి ఒప్పంద విద్యుత్తు రావలసినప్పటికీ వారినుండి సగమే అందుతుంది. అయితే తమ దగ్గర ఇంకా రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఆ తరువాత ఢిల్లీ రాజధాని చీకటిలో మగ్గవలసిందే నని దీనికి కేంద్రమే సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. అయితే రాష్ట్ర లో అలుముకున్న విద్యుత్తు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా కూడా తాము వెనకాడబోమని. ప్రజల శ్రేయస్సే మా అభీష్టమని ఈ సందర్భంగా ఢిల్లీ సతేందర్ జైన్ తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రాజధాని ప్రజల కష్టాలను తీరుస్తుందో లేదో వేచి చూడాలి మరి.     IHG

మరింత సమాచారం తెలుసుకోండి: