ఆర్.బి.ఐ చరిత్రలో  ఇదే తొలిసారి !
 
రిజర్వ్ బ్యాంక్ చరిత్రలో  ఒక కొత్త అధ్యాయం ఆరంభం కానుంది. అది కూడా డిసెంబర్ లో. ఇందుకుసంబంధించిన ఉత్తర్వులు మాత్రం ఇప్పడే వెలువడ్డాయి. భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టాక  దేశంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రంగాలను ప్రభావితం చేసిన మోడినామిక్స్ దృష్టి ప్రస్తుతం ఆర్.బి.ఐ పై పడింది.  భారత ఆర్థిక వ్యవస్థ పై దీని ప్రభావం ఎంత, ఫలితాలు ఎలా ఉంటాయి అన్న  విషయం కాలం తేల్చాల్సిందే.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లుగా ఇప్పటి వరకూ పని చేసిన  వాళ్లు ఎవరు కూడా తమ పదవీ కాలం పూర్తయిన తరువాత తిరిగి అదే పదవిలో కొనసాగ లేదు. కొందరయితదే తమ పదవీ కాలాన్ని ముందే వదలుకుని వెలుపలికి వెళ్లి పోయారు. తాజాగా  ప్రధాన మంత్రి నరేంద్రమోడీ   రిజర్వ్ బ్యాంక్ చరిత్ర లో  ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా  ప్రకటించింది కూడా. దీంతో ఈయన ఈ పదవిలో 2024 డిసెంబర్ వరకూ కొనసాగుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం లోని క్యాబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సీనియర్  ఐఏ ఎస్ అధికారి శక్తికాంత్ దాస్ ఆర్థిక  శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. అంతకు ముందు రెవిన్యూ శాఖ కార్యదర్శిగాను వ్యవహరించారు.  ఈయనకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్  ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కరణాల రీత్యా  పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానాన్ని శక్తికాంత్ దాస్ తో పూరించింది కేంద్ర ప్రభుత్వం. పటేల్ కు ముందు గవర్నర్ గా \ఉన్న రఘురామ్ రాజన్   గవర్నర్ గిరి ని వదులుకొని అధ్యాపకుడి వృత్తి లో ప్రవేశించారు. పటేల్, రఘరామ్ రాజన్ లు ఇద్దరూ కూడా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక పరమైన నిర్ణయాలను వ్యతిరేకించిన వారే. ఇక
శక్తికాంత్ దాస్  రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్ గా 2018 డిసెంబర్ 11వ తేదీ బాధ్యతలు స్వికరించారు.
ఈయన పదవీ కాలం మూడు సంవత్సరాలు. అది ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీ తో ముగియ నుంది. ఈయన  సౌమ్యడిగాపేరు తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఈయన పదవీకాలం  పొడిగింపునకు ఇదే ప్రధాన కారణం అయి ఉంటుందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

rbi