ఇప్ప‌టిదాకా హుజురాబాద్ ఫ‌లితాల‌తోనే కుస్తీలు ప‌డుతున్న పార్టీల‌కు కొత్త త‌ల‌నొప్పులు కొన్ని పుట్టుకువ‌స్తున్నాయి. అవే కోవ‌ర్టు ఆ ప‌రేష‌న్లు. గ‌తంలోనూ ఇవి ఉన్నా ఇప్పుడవి రెట్టింపు అయి ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత కూడా వీటిపైనే చ‌ర్చ సాగు తోంది తెలంగాణ‌లో! ఒక పార్టీని మ‌రో పార్టీ నిలువునా ముంచ‌డం ఒక పార్టీని మ‌రో పార్టీ చేయి ప‌ట్టుకుని మోసం చేయ‌డం లాంటివి ఎ న్నో ఉన్నాయి రాజ‌కీయంలో! అవి కాల క్ర‌మేణా పెరుగుతూ వ‌స్తున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. బ‌ద్వేలులోనూ ఇలాంటి రాజ‌కీయ‌మే న‌ డిచింది. టీడీపీ నాయ‌కులు ఎకాఎకిన బీజేపీ ఏజెంట్లుగా మారిపోవ‌డం వైసీపీని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అదేవిధంగా ఇక్క‌డ తెలంగాణ‌లో నూ పీసీసీ నాయ‌క‌త్వంపై ఎన్నో అనుమానాలూ సందేహాలూ మొద‌ట్నుంచీ ఉన్నా కూడా రేవంత్ పై కాస్త‌యినా ఆశ ఉంచుకోవడం త‌ప్పేమీ కాద‌ని కొంద‌రు ఫ‌క్తు కాంగ్రెస్ వాదులు భావించారు. కానీ ఇవన్నీ త‌ప్ప‌ని కొన్ని సంద‌ర్భాల్లో రేవంత్ చేష్ట‌లు నిరూపించేయి. మాట‌ల్లో ప‌ రాక్ర‌మం చూపి  చేతల్లో చేత‌గాని త‌నం ఉంటే ఓ రాజ‌కీయ నాయ‌కుడు రాణించ‌డు అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే! ఇప్పుడిదే రేవంత్ విష‌య‌మై రుజువు అవుతోంది. నిరూప‌ణ‌ల‌కు నోచుకుంటోంది.

చంద్ర‌బాబు కోవ‌ర్టు రేవంత్ అన్న మాట మొద‌ట్నుంచీ ఉన్నా కూడా కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడింది. వ్య‌వ‌హ‌రించింది. టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి అప్ప‌గించి గౌర‌వించింది. త‌న‌పై పార్టీ ఉన్న‌త కార్య‌వ‌ర్గం ఉంచిన న‌మ్మ‌కాన్ని నిరూపించి చూపాల్సి న రేవంత్ ఎప్ప‌టిక‌ప్పుడు చ‌తికిల‌ప‌డుతున్నారు. పార్టీని పైకి తీసుకురాలేక‌పోతున్నారు. పార్టీలో ఉన్న వ‌ర్గ రాజ‌కీయాల‌ను దిద్ద‌లేకపో తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స్ట్రాట‌జీలో వెనుక‌బ‌డిపోతున్నారు. కేవ‌లం కేసీఆర్ ను తిట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారే త‌ప్ప రేవంత్ సాధించిందేమీ లేద‌న్న మాట‌కు ఆయ‌న న‌డ‌వ‌డే ఉదాహ‌ర‌ణ. అందుకే కాంగ్రెస్ పూర్వ వైభ‌వం రేవంత్ తో సాధ్యం కాద‌న్న సంగ‌తి తేలిపోయింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయ  నాయ‌కులు దొర‌క్క రేవంత్ ను కాంగ్రెస్ భ‌రిస్తుందా అన్న సందేహం కూడా ఒక‌టి వెలుగులోకి వ‌స్తోంది.



వాస్త‌వానికి రేవంత్ ను ముందు నుంచి పార్టీలో ఉన్న వారెవ్వరూ అంగీక‌రించ‌డం లేదు. వైఎస్సార్ వ‌ర్గం కూడా అదే కోవ‌లో ఉంది. పేరుకు రెడ్డి సామాజిక‌వ‌ర్గం కు చెందిన నేత అయిన‌ప్ప‌టికీ ఓటుకు నోటు కేసుతో చంద్ర‌బాబు చెప్పిన విధంగా న‌డుచుకునే నేత‌గా పేరు స్థిర‌ప‌డిపోవ‌డంతో నాటి ఇమేజ్ ను ఆయ‌న తొల‌గించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్లు ఎవ్వ‌రూ రేవంత్ కు మ‌ద్ద‌తివ్వ‌డం లేదు. పైకి మాట్లాడుతున్నా లోపల మాత్రం త‌మ ప‌ని తాము చేసుకునేందుకు సిద్ధం అయిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి జిల్లాల‌లో రేవంత్ పర్య‌టించినా కూడా ప్ర‌భావం  ఇప్ప‌టికిప్పుడు రాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: