ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకొని ప్రియాంక రాజకీయాలు చేస్తున్నారనే వాదన అందరికీ తెలిసిన విషయమే. దాదాపు సంవత్సరం క్రితం నుంచే `ఆపరేషన్ యూపీ` ని స్టార్ట్ చేసిన ప్రియాంక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 90వ దశకం వరకు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ కంచుకోటగా ఉందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రియాంక గాంధీ రంగంలో దిగారు. 2017 శాసనసభ 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోరమైన ఓటమితో నిస్తేజం అవహించిన కాంగ్రెస్ కేడర్లో నేనున్నాంటూ ఆమె భరోసా కల్పించారు.ఇక గత కొంతకాలంగా ప్రియాంక జనం మధ్యలోనే ఉన్నప్పటికీ యూపీ ఎలక్షన్స్ లో ఆమె ప్రభావం ఎంత అనే విషయాన్ని రాజకీయ పరిశీలకులు అసలు అంచనా వేయలేకపోతున్నారు.

నిజానికి ప్రియాంక గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలపడి ముక్కోణపుపోటీ ఏర్పడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఇక తమకు లబ్ధి చేకూర్చుతుందని కమలనాధులు భావించడం జరిగింది. కానీ ప్రియాంక గాంధీ మాయావతి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెద్దగా చీలే ఛాన్స్ లేదని సమాజ్వాదీ పార్టీతో పోటీ తప్పడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా యూపీలో ప్రియాంక గాంధీ జోరుగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు వారు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఎన్నికలకు దాదాపు సంవత్సరం ముందు నుంచే యూపీ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన ఆమె క్షేత్రస్థాయి పరిస్థితులపై కూడా ఓ అంచనాకు వచ్చారు.ఇక లీడింగ్ లో వున్న బీజేపీ పార్టీ ప్రతిపక్ష ఎస్పీలకు భిన్నంగా ప్రియాంకా గాంధీ పావులు కదుపుతున్నారు.మరి ఈ నేపథ్యంలో ప్రియాంక ఏ మేరకు ఇక్కడ సత్తా చాటుతారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. మరి ఏం జరుగుతుంతో ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: