ఆర్టీసీ కార్మికుల పై తెలంగాణ ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. సమ్మె చేస్తున్న కార్మికులతో ఇక చర్చలు లేవని.. డ్యూటీలో చేరకపోతే.. ఉద్యోగాలు వదలుకోవాల్సిందేనని శుక్రవారం రాత్రి రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.


కార్మికుల న్యాయమైన హక్కులను కాలరాసే విధంగా ముఖ్యమంత్రి పాశవికంగా పాలిస్తున్నారని.. టీపీసీసీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, సమ్మె చేసిన వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు, ప్రజలు.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజలపై ముఖ్యమంత్రి చూపిస్తున్న అక్కసుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు.


ఇంకా వారు ఏమన్నారంటే.. “ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా విధుల్లో చేరని వారిని ఉద్యోగాలు పీకేస్తామని బెదిరించడం పాశవిక, నియంత చర్య.. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రజలు బస్ లు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతారు. ప్రజల కష్టాలకు, నష్టాలకు ముఖ్యమంత్రి నే కారణం.. కార్మికులతో ప్రజాస్వామ్య బద్దంగా చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలి. ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తుంది.. అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు.


అంతకుముందు.. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి రాగానే ఆర్టీసీ సమ్మెపై కార్మికులతో చర్చిస్తున్న త్రిసభ్య కమిటీని పిలిపించుకుని ఆయన మాట్లాడారు. కార్మికులతో జరిగిన చర్చల వివరాలను కేసీఆర్ కు వారు వివరించారు. ఇక కార్మికులతో చర్చించ కూడదని.. ప్రభుత్వం పవర్ ఏంటో చూపించాలని కేసీఆర్ నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: