చంద్రబాబుకు ఇపుడు కమలం బాగా అందంగా కనిపిస్తోంది.  ఆరు నెలల ముందు వరకూ మోడీని, అమిత్ షాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన ఘనాపాటి చంద్రబాబు. మోడీని వ్యక్తిగతంగా కూడా దాడి చేశారు. అలాగే మోడీకి ఏపీలో నల్ల జెండాలతో స్వాగతం, అమిత్ షాకు తిరిపతి టూర్ కి వస్తే అలిపిరి వద్ద రాళ్ళ దాడి ఇవన్నీ బాబు జమానాలో జరిగిన చిత్రాలే. కేంద్రంతో తగవు పెట్టుకుని రాహుల్ గాంధీతో జట్టు కట్టి మోడీ, అమిత్ షాలాకు చిర్రెత్తించిన బాబు ఇపుడు ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. దాంతో ఆయనకు తత్వం బోధపడిందట.


ఇదిలా ఉండగా బాబు  అర్జంటుగా ఆరెసెస్ ఆఫీస్ కి వెళ్ళి చీఫ్ మోహన్ భగవత్ తో చర్చలు జరిపారన్న వార్త ఇపుడు వైరల్ అవుతోంది. దాదాపుగా మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో  రాజకీయమె ప్రధాన అజెండాగా చెబుతున్నారు. ఏపీలో మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు ఆరాటపడుతున్న బాబు తమ  బంధం గట్టి చేయమని భగవత్ ని కోరినట్లుగా చెబుతున్నారు. ఈ మీటింగుని కేంద్ర మంత్రి గండ్కరీ చొరవతో ఏర్పాటు చేశారని అంటున్నారు.


అయితే ఎవరెన్ని చెప్పినా, మరే విధంగా వత్తిడి తెచ్చినా కూడా చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఇద్దరే ఇద్దరు. వారే మోడీ, అమిత్ షా. ఈ ఇద్దరికీ ఇప్పటికీ కూడా బాబు మీద పీకల్లోతు కోపం ఉందని అంటున్నారు. బాబు ఎంత ప్రాధేయపడినా ఆయన అసలు స్వరూపాన్ని ఎన్నికల ముందు చూపించేశారు కాబట్టి ఈ ఇద్దరు అసలు నమ్మరని అంటున్నారు. అందువల్ల బాబు ప్రయత్నాలు వ్రుధా ప్రయాసగానే మిగిలిపోతాయని అంటున్నారు.


ఇక  బీజేపీలో బాబుకు గండ్కరీ, రాజ్ నాధ్ సింగ్ వంటి వారు మిత్రులుగా ఉన్నారు కానీ వారికి ఆ పార్టీలో అంత బలం లేదు. వారు బాబుని తీసుకోమని మోడీకి డైరెక్ట్ గా చెప్పలేరు. ఇక ఆరెసెస్ వంటి సంస్థలు మోడీకి రాజకీయ దిశా నిర్దేశం చేస్తాయి తప్ప పొత్తుల గురించి గట్టినా చెప్పి ఒప్పించలేవు. కానీ బాబు పడుతున్న తాపత్రయం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఓ వైపు మీరు వద్దు పొండి అని రాం మాధవ్ లాంటి వారు ఒకటికి పదిసార్లు చెబుతున్నా బాబు ఇంకా బీజేపీ అని కలవరిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం బాబుని మెచ్చుకుని తీరాల్సిందేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: