ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే స్వర్ణ బియ్యం ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పంపిణి జరుగుతుంది అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నేడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కావడంతో రెండో రోజు సందర్భంగా మంత్రి రంగ నాథ్ రాజ్ స్వర్ణ బియ్యం గురించి వెల్లడించారు.       

 

ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న స్వర్ణ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాలకు పంపిణి చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని, ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన ఇస్తున్నట్టు తెలిపారు.      

 

కాగా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ కాకుంగా ప్యాకేజీ చేసి ఇస్తున్నట్టు.. ప్రజలకు ఇస్తున్న ఒక కిలో బియ్యం ఖర్చు 37 రూపాయిలు అయినట్టు మంత్రి రంగనాథ రాజు తెలిపారు. ప్రస్తుతం స్వర్ణ రకం బియ్యం ప్రజలకు అందిస్తున్నట్టు, భవిష్యత్తులో సరఫరా చేసేందుకు 25 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తున్నట్టు రంగనాథ రాజు తెలిపారు. ప్రస్తుతం స్వర్ణ రకం బియ్యం ప్రజలకు అందిస్తున్నట్టు రంగనాథ రాజు తెలిపారు.     

 

కాగా ఈ నెలలో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయాలనీ సీఎం జగన్ గతంలోనే అధికారులకు ఆదేశించారు. అంటే.. ఇంకా నాలుగు నెలలలో ప్రతి ఇంట్లో స్వర్ణ బియ్యం ఉండనున్నాయి అన్నమాట. ఏది ఏమైనా స్వర్ణ బియ్యం పంపిణి ప్రతి ఒక్కరికి ఆనందం కల్గిస్తుంది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: