ఈ మధ్య రాజకీయాలు వైసీపీలో కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సెంటర్ గా నడుస్తున్నాయి. సీఎం జగన్ కరోనా కట్టడి చేయడంపై దృష్టి పెట్టడంతో, ప్రతిపక్షాలు చేసే విమర్సలు చెక్ పెట్టేందుకు విజయసాయి ప్రయత్నిస్తున్నారు. అసలు టీడీపీ, బీజేపీ నేతలు విజయసాయి లక్ష్యంగానే విమర్సలు చేస్తున్నారు. ప్రతిరోజూ విజయసాయిపై ఏదొరకంగా విమర్సలు వస్తూనే ఉన్నాయి.

 

ఇదే సమయంలో విశాఖపట్నంపై విజయసాయి పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం విజయసాయి అని మొన్నటివరకు విమర్సలు చేశారు. ఇక ఇప్పుడు విశాఖని గ్రీన్ జోన్ గా పెట్టేందుకు కరోనా కేసులని కూడా దాస్తున్నారని అంటున్నారు. పైగా విరాళాల పేరుతో విజయసాయి దందాలు కూడా చేస్తున్నారని, బెదిరించి మరి విరాళాలు వసూలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా విజయసాయి కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతూ, లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారని చెబుతున్నారు.

 

అలాగే జగన్ తెలియకుండా, విజయసాయి రాజకీయం చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, విజయసాయిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ భూములపై పంచాయతీలు మొదలయ్యాయని.. 10 కోట్లిస్తావా? జగన్ రెడ్డికి చెప్పి లాక్కోమంటావా? అని దందా తీరు కొనసాగుతోందని విమర్శించారు. ఇకపై విశాఖపట్టణం.. విజయసాయి పట్టణమైపోతుందేమోనని ఆందోళనగా ఉందన్నారు. పాలనా రాజధాని పేరుతో విశాఖని పంచుకుతినేందుకు.. పులివెందుల పంచెలు దిగాయని మాట్లాడారు.

 

అయితే రాజధాని తరలింపుని ఏదొకవిధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పైగా విశాఖలో విజయసాయి కీలక నేత కాబట్టి ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు. అందుకే ఇలాంటి విమర్శలకు చెక్ పెడుతూ, విజయసాయి విశాఖ ఎట్టి పరిస్థితుల్లోనైనా రాజధాని అవుతుందని చెప్పారు. మరి చూడాలి విజయసాయి చెప్పినట్లు విశాఖ రాజధానిగా ఎప్పుడు కనిస్తుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: