ప‌ని పాటా లేకుండా ఎలా పొద్దు పుచ్చాలా ? అని ఆలోచించే వాడు దారి వెంట వెళ్లే ప్ర‌తి వాళ్ల‌ను పిలిచి సొల్లు క‌బుర్లు చెప్పుకుంటూ కాల‌క్షేపం చేస్తుంటాడ‌ట‌. ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న సామెత. ఈ సామెత ఇప్పుడు మ‌న టీడీపీ వీరాభిమానులు.. బాబోరి వీరాభిమానుల్లో చాలా మందికి వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం పార్టీ ఓడిపోయి ఘోరంగా ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉంది. ఓ వైపు క‌రోనా ప్ర‌ళ‌యం త‌రుముతోంది. ఏపీలో ప్ర‌భుత్వంతో పాటు మంత్రులు, కీల‌క నేత‌లు ఈ క‌ష్ట‌కాలంలో త‌మ వంతుగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌తో పాటు ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా చేసేందుకు పోరాటాలు చేస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇన్‌చార్జ్ విజ‌య‌సాయిరెడ్డి ఉత్త‌రాంధ్ర‌లో క‌రోనా విష‌యంలో మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. ఆయ‌న స్వ‌యంగా పార్టీ త‌ర‌పున‌, ప్ర‌భుత్వం త‌ర‌పున చేస్తోన్న ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై బాబోరి అభిమానులు ప‌స‌లేని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ కాలంలో విజ‌య‌సాయి విజ‌య‌వాడ - విశాఖ‌ప‌ట్నం మ‌ధ్య 14 సార్లు ప్ర‌యాణించార‌ని. ఇది 4900 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం అని.. ఇక విశాఖ‌ప‌ట్నం - హైద‌రాబాద్ మ‌ధ్య రెండు సార్లు ప్ర‌యాణించారు.. ఇది 1240 కిలోమీట‌ర్లు అని.. ఇక విశాఖ‌ప‌ట్నం - విజ‌య‌న‌గ‌రం - శ్రీకాకుళం మ‌ధ్య 10 సార్లు తిరిగారు.. ఇది 1200 కిలోమీట‌ర్లు అని ఓ పోస్ట‌ర్ వేసి ట్రోల్ చేస్తున్నారు.

 

నిజంగా ఈ క్లిష్ట స‌మ‌యంలో విజ‌య‌సాయి త‌న ఆరోగ్యం కూడా రిస్క్‌లో పెట్టి ఉత్త‌రాంధ్ర‌పై బాగా ఫోక‌స్ చేశారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, అటు పార్టీ కార్య‌క్ర‌మాల ద్వారా వైజాగ్‌లో ప్ర‌బ‌లిన క‌రోనా క‌ట్ట‌డిలో ఆయ‌న త‌న వంతుగా యంత్రాంగాన్ని ఉరుకులు ప‌రుగులు పెట్టించి స‌క్సెస్ చేయించారు. అలాంటి విజ‌యసాయిని ఇప్పుడు బాబోరు అభిమానులు జ‌ర్నీలో గిన్నీస్ రికార్డులు ఎక్కారంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: