పీవీ సింధు... ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారతదేశానికి ఒలంపిక్స్ లో రజత పథకాన్ని అందించిన వ్యక్తి. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన అమ్మకు మాత్రం మనం ఇంకా చిన్న పిల్లలమే. ఇలాంటి పరిస్థితి లోనే పీవీ సింధు కూడా తన భావాలను వ్యక్తపరిచింది. తాను ప్రపంచ ఛాంపియన్ గా నిలిచే తరుణంలో తన తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేనివి అంటూ పీవీ సింధు తెలియజేసింది. ఇక 2016 సంవత్సరంలో జరిగిన రియో ఒలంపిక్స్ కి ముందు ఎలాంటి అంచనాలు లేని ఈమె ఒక్కసారిగా ఆ గేమ్ విజయం అందుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి ఆ పతకం సాధించడానికి వెనక తన కుటుంబ సభ్యుల కష్టం ఉంది అని పీవీ సింధు తెలియజేసింది. 


పీవీ సింధు ఆ విషయాన్ని తెలియజేస్తూ... ‘రియోకు ముందే మేం అకాడమీకి మారాం. నా అకాడమీ శిక్షణ కోసం మా అమ్మ.. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. అంతేకాకుండా నాన్న కూడా రెండు సంవత్సరాలపాటు లాంగ్ లీవ్ తీసుకోవడం జరిగింది. నిజానికి ఈ నిర్ణయం నా ఆటకు చాలా సహాయపడింది అని పీవీ సింధు తెలియజేసింది. ఇకపోతే 2015 వ సంవత్సరంలో నా గాయం నుంచి కోలుకోవడానికి చాలా పెద్ద సవాలుగా మా కుటుంబానికి  మారింది అని తెలిపింది. 


అంతేకాకుండా ఇక రియో గేమ్స్‌ కు అర్హత కోసం ఒక సంవత్సరంలో 23 టోర్నీలలో ఆడాను అంటూ వివరించడం జరిగింది. ఈ విషయాన్ని అంతా గో స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన అసిస్టెంట్ డైరెక్టర్ కోసం చేపట్టిన ఆన్లైన్ సెషన్లో సింధూ తెలియజేసింది. నిజానికి ఒక అథ్లెటిక్ చాంపియన్ కావాలి అంటే తల్లిదండ్రులు, కోచ్ లు, పరిపాలకులు కలిసి ఒక టీంగా పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది అని స్పష్టంగా పీవీ సింధు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: