ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న ఎన్.వి.రమణ హైకోర్టును ప్రభావితం చేశారు అంటూ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాడోపేడో తేల్చుకోవడానికి న్యాయవ్యవస్థపై పోరాటానికి సిద్ధమయ్యారు జగన్మోహన్రెడ్డి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టిడిపి జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్ చేశారు. వ్యవస్థ పై వైసీపీ దాడి చేస్తుందని రాజ్యాంగాన్ని చట్టాలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు ఏకంగా  న్యాయ వ్యవస్థ పైన బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటూ మండిపడ్డారు.



 ఒక తెలుగు వాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తుంటే సంతోష పడకుండా దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. న్యాయవ్యవస్థపై కామెంట్లు చేస్తున్న వైసీపీ నేతలను దేశం మొత్తం చీ కొడుతున్నప్పటికీ ... వారి తీరు లో ఉన్న మాత్రం మార్పు రావడం లేదు అంటూ విమర్శించారు చంద్రబాబు నాయుడు. ఇక ఇటీవలే ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో సీఎం జగన్ కు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పింది అంటూ చంద్రబాబు ప్రస్తావించారు.



 అంత అవినీతిపరుడైన సీఎం జగన్ ప్రస్తుతం ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో న్యాయవ్యవస్థపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. తెలుగువారందరికీ చెడ్డ పేరు తెచ్చే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ ఆరోపించిన చంద్రబాబు నాయుడు... రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటూ విమర్శించారు. గూండాలు రౌడీల దాడులు పెరిగిపోయాయని... దళితులకు మహిళలకు ఆడబిడ్డలకు రక్షణ లేదు అంటూ విమర్శించిన చంద్రబాబు.. జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది అంటూ విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: