తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అవి ఎంత వరకు ఫలిస్తాయి ఏంటీ అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం అనేది లేదు అనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పుడు తీవ్రంగానే కష్టపడుతుంది. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ని కూడా మార్చిన సంగతి తెలిసిందే.  మనిక్కం ఠాగూర్ కి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన తెలంగాణా సర్కార్ పై హైదరాబాద్ వర్షాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. మనిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ హైద్రాబాద్ లో ప్రజలు ఇటీవల వరదల్లో చిక్కుకొని బాధలు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. వరదలల్లో చనిపోయిన వారికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. బాధల్లో ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని ఆయన హామీ  ఇచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలను నమ్ముకుంటుంది అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ మూల సిద్ధాంతం అని ఆయన వివరించారు.

పక్క వారిని ప్రేమించడం, గౌరవించడం మన సంప్రదాయం అని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వ్యక్తులతో పని చేసిన నాయకులతో నేను పని చేయడం నాకు గర్వాంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాబోయే జనరేషన్ గురించి ఆలోచించారు అని ఆయన చెప్పారు. ఇప్పుడున్న ప్రధాన మంత్రులు రాబోయే ఎన్నికల గురించి, ఈవిఎం ల గురించి ఆలోచిస్తారని అన్నారు. రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ  కూడా రాబోయే 30 ఏళ్ల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: