మన తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఆ పార్టీ నేతలు మాత్రం ఏదో ఒక రూపంలో అవకాశాలను సృష్టించుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే బీజేపీని బలోపేతం చేయడానికి ప్రధానంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కూడా బండి సంజయ్ విషయంలో కాస్త సీరియస్ గానే ఉండాలి అని భావిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో మంత్రి హరీష్ రావుని ఆయన టార్గెట్ చేసిన విధానం ఇప్పుడు చాలా వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలకు గా ఆగ్రహంగా మారింది.

ఆయనను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా టిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది అనే మాట అక్షరాలా నిజం. అయితే ఇప్పుడు చూస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎలాంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొందరు నేతలను తమ పార్టీలోకి తీసుకునే విధంగా బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కొంతమంది టీఆర్ఎస్ లో గట్టిగా మాట్లాడే నేతలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

బీజేపీ లోకి వస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా కీలక పదవులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అవసరమైతే రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా వారి కోసం వదులుకుంటాను అని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇచ్చే సీటు విషయం కూడా ఆయన హామీ ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం. మరి ఎవరు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు అవకాశాలు రాక  నిరాశగా ఉండి... బలంగా మాట్లాడే వారిని తమ వైపు తిప్పుకునే టీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలని వారిద్వారా విమర్శలు చేయించాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: