నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదో ఒక రూపంలో నిజామాబాద్ ను అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఆయన మీద ఎన్ని విమర్శలు ప్రత్యర్ధులు చేసినా సరే ఆయన మాత్రం ఎక్కడ దూకుడు తగ్గించకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పారు. నా తోటి ఇందూరు వాసులకు ఈ బీజేపీ కార్యకర్త ఇస్తున్న  దసరా కానుక  అని ఆయన ప్రకటన విడుదల చేసారు.

“మా చిరకాల స్వప్నం అయిన మాధవ నగర్ 4 లేన్ ఆర్ ఓ బీ శాంక్షన్ చేస్తూ మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ నుండి లెటర్ అందింది. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూసిన మాధవ నగర్, ఆర్ ఓ బీ కి మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ ఆమోదం తెలిపింది. నేను బీజేపీ పార్టీలో చేరిన కొద్దీ రోజులకే ఈ ఆర్ ఓ బీ పై పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి తీవ్ర ప్రయత్నం చేశాను. ఎంపీ అయ్యాక, ఈ ఫైలుని మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సంసిద్ధత వ్యక్తం చేసి, రాష్ట్ర ప్రభుత్వ వాటాని కూడా తన ఆమోదం తెలపాలని సూచించారు.

సెప్టెంబర్ లో జరిగిన దిశ మీటింగ్ లో ఆర్ అండ్ బీ అధికారులను ఈ విషయమై తీవ్రంగా మందలించగా, మూడు రోజులకే ఆ మంత్రిత్వ శాఖ నుండి నివేదికలు వెళ్లి, ఎట్టకేలకు ఆర్ ఓ బీ శాంక్షన్ అయ్యింది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ కి వెళ్లే ఈ మార్గంలో ఎన్నో వాహనాలతో పాటు అంబులెన్సులు గంటల తరబడి రైల్వే గేట్ దగ్గర నిరీక్షించాల్సి వస్తుంది. ఈ ఆర్ ఓ బీ నిర్మాణం సంవత్సరం లోపు పూర్తి చేసి, ఈ ఇబ్బందులను తొలగించాలి” అని ఆయన ఒక ప్రకటన చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: