ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలపడే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు తమ వైపు తిప్పుకోవడానికి కాస్త ఎక్కువగానే భారతీయ జనతాపార్టీ కష్టపడుతుంది అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలతో ఇప్పటికే బీజేపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం. బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు చెందిన కొంత మంది నేతలతో చర్చలు జరుపుతున్నారు.

 వారిని బిజెపి లోకి తీసుకు రావడానికి ఆయన కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసారు.  ఈ నేపథ్యంలోనే వారికి కొన్ని పదవులను కూడా ఆయన ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలను బయటకు తీసుకురావడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారని టాక్. చంద్రబాబు నాయుడు వైఖరితో సీరియస్ గా ఉన్న మాజీ కేంద్రమంత్రి ఒకరిని బయటకు తీసుకురావడానికి ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారని సమాచారం. అంతేకాకుండా అనంతపురం జిల్లాకు చెందిన ఒక బలమైన కుటుంబాన్ని కూడా ఇప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు సీఎం రమేష్ ఎక్కువగా చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

వారితో ఇప్పటికే ఆయన చర్చలు కూడా జరిపారని వారు కూడా పార్టీ మారడానికి ఆసక్తి గా ఉన్నారని అంటున్నారు. అయితే ఎప్పుడు పార్టీ మారతారా ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అదే విధంగా కడప జిల్లాకు చెందిన ఒక కీలక నేతను కూడా ఇప్పుడు బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి వారు ఎప్పుడు పార్టీ మారుతారు ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: