గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీ ల అభ్యర్థులు ప్రచారంలో రెచ్చిపోగా ఎవరికీ వారే తమదే గెలుపు అన్నట్లు వ్యవహరించారు. అంతేనా ఇతర పార్టీ లపై చేసే విమర్శలు చూస్తుంటే ఇవి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ముఖ్యంగా ఈ వార్ టీ ఆర్ ఎస్ ల మధ్య స్పష్టంగా కనిపించింది.. తెలంగాణ లో బలపడుతున్న బీజేపీ కి ఇది శుభ పరిణామం కాగా టీ ఆర్ ఎస్ హవా ని ఈ పార్టీ కొంత తగ్గిస్తూ వచ్చిందని చెప్పాలి. బండి అధ్యక్షుడు అయ్యాక ఈ వ్యవహార శైలి ఎక్కువగా ఉండడంతో బీజేపీ పార్టీ తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదిగింది.

ఇక ఈ గ్రేటర్ వార్ లో అన్ని పార్టీ లు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఆయాపార్టీ ల అభ్యర్థులను పరిశీలిస్తే అర్థమవుతుంది. 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 85, బీజేపీ 74, కాంగ్రెస్‌ 75 మంది మహిళలను బరిలో నిలిపాయి. మేయర్‌ పీఠం దక్కించుకోవాలనే ఆశతో అన్ని పార్టీలు జనరల్‌ స్థానాల్లో ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించారు. ఏ పార్టీ గెలుస్తోందో.. ఏ మహిళకు గ్రేటర్‌ మేయర్‌ అవకాశం లభిస్తోందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

మొత్తంగా ఈ గ్రేటర్ పరిధిలో అన్ని పార్టీ లకు కలిపి 234 మంది మహిళలు బరిలోకి దిగుతున్నారు.  కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, కార్వాన్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని పలు డివిజన్ల నుంచి పోటీచేస్తున్న వివిధ పార్టీల మహిళా అభ్యర్థులు పురుషుల కంటే ఆసక్తికరంగా ప్రచారం కొనసాగించారు అయితే లేడీ సెంటిమెంట్ ని అన్ని పార్టీ లు ఉపయోగిస్తుండగా వారు కూడా ఇంటింటికి తిరిగి వెండి కుంకుమ భరిణెలు, చీరలు పంపిణీ చేసి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఏదేమైనా చట్టసభల్లో ఆడవారు దూసుకుపోవడం దాదాపు యాభై శాతం మంది పోటీ చేయడం అంటే మంచి పరిణామమే అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: