మ‌న దేశంలో చాలా రాష్ట్రాల మ‌ధ్య స‌రిహ‌ద్దు గొడ‌వ‌లు.. ప్రాంతాల గొడ‌వ‌లు ఉన్నాయి. ఈ గొడ‌వ‌ల వ‌ల్లే దేశంలో అనేక రాష్ట్రాలు విడిపోయాయి. అంతెందుకు తెలుగు జాతి రెండు ముక్క‌లు అయ్యి ఏపీ, తెలంగాణ‌గా విడిపోయింది. స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ గొడ‌వ‌లు ఇలాగే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర - క‌ర్నాట‌క రాష్ట్రాల మ‌ధ్య ఇప్పుడు స‌రిహ‌ద్దు వివాదం న‌డుస్తోంది. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు క‌ర్నాక‌ట‌, మ‌హారాష్ట్ర‌లో కొన్ని ప్రాంతాలు నైజాం పాల‌న‌లో ఉండేవి. ఇక ఇప్పుడు క‌ర్నాక‌ట‌లో ఉన్న కొన్ని ప్రాంతాలు బాంబే ప్రావిన్స్‌లో ఉండేవి. అయితే ఆ త‌ర్వాత వాటిని క‌ర్నాట‌క‌లో క‌లిపారు. ఇక నైజాం పాల‌న‌లో ఉన్న బీద‌ర్‌, బ‌ళ్లారి, రాయ‌చూర్ క‌ర్నాట‌క‌లో క‌లిశాయి.

ఇక ఇదే నైజాం పాల‌న‌లో ఉన్న ఔరంగాబాద్‌, ధ‌ర్మాబాద్‌, నాసిక్‌, నాందేడ్ మ‌హారాష్ట్ర‌లోకి వెళ్లిపోయాయి. ఈ క్ర‌మంలోనే క‌ర్నాట‌క స‌రిహ‌ద్దులో ఉన్న బెళ‌గావి ప్రాంతాన్ని తిరిగి బాంబేలో క‌ల‌పాల‌ని అక్క‌డ ప్ర‌జ‌లు కోరుతున్నారు. వారంతా మ‌రాఠీయే మాట్లాడ‌తారు. అప్ప‌ట్లో బెళ‌గావి ప్రాంతాన్ని క‌ర్నాట‌క‌లో క‌ల‌ప‌డంపై మ‌హారాష్ట్ర‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు జ‌రిగాయి. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు దీనికి వ్యతిరేకంగా గ‌ళ‌మెత్తారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దాదాపు 10 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ గొడ‌వ ఇలా జ‌రుగుతూ ఉండ‌గానే తాజాగా ఇది రాజ‌కీయ ప‌ర‌మైన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన మెసేజ్ చేశారు. కర్ణాటక ఆధీనంలో ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుతామని ఆయన సోషల్ మీడియా సాక్షిగా తెలిపారు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య వివాదం రాజుకుంది. దీనిని క‌ర్నాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప తీవ్రంగా ఖండిస్తున్నారు. బెళ‌గావి ప్రాంతం ఎప్ప‌ట‌కీ క‌ర్నాక‌ట‌లోనే ఉంటుంద‌ని చెపుతున్నారు. ఓ ప్రాంతం కోసం ఏకంగా ఇద్ద‌రు సీఎంలు మాట‌ల యుద్ధానికి దిగ‌డంతో ఇక్క‌డ రాజ‌కీయ వేడి రాజుకోనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: