తెలుగుదేశం పార్టీ ఆవిర్భ‌వించిన ఈ మూడున్న‌ర ద‌శాబ్దాల కాలంలో ప్ర‌స్తుతం ఆ పార్టీ ఎదుర్కొంటోన్నం త గ‌డ్డు ప‌రిస్థితి మ‌రెప్పుడూ ఎదుర్కోలేదు. పార్టీ నుంచి చాలా మంది నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోగా ఉన్న వాళ్ల‌ను కాపాడు కోవ‌డ‌మే చంద్ర‌బాబుకు చాలా క‌ష్టంగా మారింది. వైసీపీ వేసిన స్కెచ్‌లో విల‌విల్లాడుతూ చాలా మంది నేత‌లు బ‌య‌ట‌కు జారిపోయారు. ఉన్న వాళ్ల‌లో కూడా ఎప్పుడు ఎవ‌రు ?  పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఏ పార్టీకి అయినా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిల‌దొక్కు కోవాలంటే ఆర్థికంగా పుష్క‌ల‌మైన అండ‌దండ‌లు, వ‌న‌రులు ఉండాలి.

టీడీపీ గ‌త ఐదేళ్ల పాటు అధికారంలో ఉండ‌డంతో పార్టీకి కావాల్సిన‌న్ని వ‌న‌రులు పుష్క‌లంగా దొరికేశాయి. పార్టీ నేత‌లు కాని.. పార్టీ కార్య‌క్ర‌మాలు కాని మాంచి ధూమ్‌ధామ్‌గా జ‌రిగేవి. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. పార్టీకి ప్ర‌జ‌ల్లో ఇప్ప‌ట్లో న‌మ్మ‌కం లేనంత ఘోరంగా ఓడిపోవడం ఒక షాక్ అయితే.. ఇప్పుడు పార్టీకి ఆర్థికంగా పెద్ద దిక్కుగా ఉన్న నేత‌ల‌ను అంద‌రిని వైసీపీ పార్టీకి దూరం చేస్తోంది. మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు లాంటి నేత‌లు కూడా ఇలాగే బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

వైసీపీ ప్ర‌త్యేకంగా  తెలుగు దేశం పార్టీ ఆర్ధిక మూలాలను వెతికి వెతికి మ‌రీ దెబ్బ కొడుతోంది. ఇక ఫైనాన్షియ‌ల్ గా స్ట్రాంగ్‌గా పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు లాంటి వాళ్లే ఇప్పుడు ఫుల్ సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఆర్థికంగా బ‌లంగా ఉన్న వాళ్లు పూర్తిగా సైలెంట్ అయిపోవ‌డ‌మో లేదా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం కావ‌డ‌మో చేస్తున్నారు. ఇక త్వ‌ర‌లో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక‌తో పాటు ప‌లు ఎన్నిక‌లను కూడా ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క టీడీపీ తీవ్రంగా స‌త‌మ‌త మ‌వుతోంది.

ఇప్పుడే ఈ ప‌రిస్థితి ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు యేడాదిన్న‌ర ముందు నుంచి మ‌రిన్ని ఖ‌ర్చులు ఉంటాయి. అప్పుడు పార్టీ అధిష్టానం.. పార్టీ నేతలు ఎలా త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారు ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: