ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తల సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని గత కొంత కాలంగా మనం వింటూనే న్నాం. కార్యకర్తల విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా వైసిపి ప్రజల్లో మరింత చులకన అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలు జగన్ కు  ప్రధాన బలంగా ఉన్నారు. వాలంటీర్ ఉద్యోగాలు ఎక్కువగా కార్యకర్తలకు వచ్చాయని వైసీపీ నేతలు పదేపదే చెబుతూ వస్తున్న సరే దాని కారణంగా ప్రజలలో పెద్దగా పార్టీకి మద్దతు రావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాలంటీర్లు ఇప్పుడు కార్యక్రమాలు చేపడుతున్న సరే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్యకర్తలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. పనిచేసిన చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఉద్యోగాల కల్పన మీద కంటే కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో ప్రజల్లో పార్టీ ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి సరేసరి. చాలావరకు కంపెనీలు రాష్ట్రానికి రావడం ఆగిపోయిన పరిస్థితి ఉంది.

కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ముఖ్యమంత్రి జగన్ దీని మీద దృష్టి పెట్టి యువతను ఆకట్టుకునే విధంగా పనిచేయాల్సి ఉంది. రాష్ట్రంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కొత్త చట్టం చేసిన తర్వాత చాలావరకు కంపెనీలు రాష్ట్రానికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా సరే జగన్ దీని మీద దృష్టి సారిస్తారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కార్యకర్తలకు కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడటంతో వైసీపీ నేతల్లో కూడా ఆందోళన మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: