ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కొన్ని అంశాలలో ఎక్కువగా ఫోకస్ పెట్టక పోతే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య సదుపాయాల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేసుకునే ఆలోచనలో చాలా మంది రోగులు ఉన్న సంగతి అర్థమవుతుంది. ఈ నేపద్యంలో సరిహద్దు రాష్ట్రాలు అన్ని కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తెలంగాణ పోలీసులు అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి.

వాస్తవానికి దేశంలో ఎక్కడైనా సరే రోగులు చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ఆస్పత్రులు అందుబాటులో ఉండటాన్ని బట్టి రోగులు చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాని తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే వారిని అడ్డుకోవడంతో తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో మూడేళ్ల పాటు ఉంటున్న  తెలిసిందే. అయినా సరే తెలంగాణ పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది.

దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అయితే తెలంగాణలో ఆసుపత్రుల మీద ఒత్తిడి పెరిగి పోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని కొంతమంది అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా తెలంగాణ ప్రభుత్వం తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. మిగిలిన నాయకులెవరూ కూడా మాట్లాడే ప్రయత్నం విమర్శించే ప్రయత్నం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: