వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం చుట్టూ  తుఫాను గులాబ్ ఆదివారం ఉదయం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో 270 కిలోమీటర్లు, తూర్పు ఆగ్నేయంలో  గోపాల్ పూర్- కళింగపట్నానికి తూర్పున 330 కిలోమీటర్ల దూరంలో ఇది కొనసాగింది. అయితే, ప్రమాదకర స్థాయిలో గులాబ్ తుఫాను తీరం వైపు దూసుకు వస్తుండంతో కేంద్రంతో పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గులాబ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో తొలుత ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి.. దాన్ని ఆదివారం రెడ్డి డైరెక్ట్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ ఆర్కె జెనమణి వివరించారు. ఈ తుఫాను పశ్చిమం వైపుగా ప్రయాణిస్తూ.. ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్ పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గులాబ్ తుఫాన్ ప్రభావం ఏపీ ఒడిశా లతోపాటు తెలంగాణ, బెంగాల్, చత్తీస్ ఘడ్, విధర్బ ప్రాంతాలపై కూడా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా తుఫాను ప్రభావం కారణంగా  పలు రాష్ట్రాలు ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షంతో ఏపీ, ఒడిశాలలో రవాణా వ్యవస్థ స్తంభించింది.పలు రైళ్లు సైతం నిలిచిపోయాయి.ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే భువనేశ్వర్- తిరుపతి, పూరి -చెన్నై సెంట్రల్, హెచ్ ఎస్ నాందేడ్ - సంబల్ పూర్, రాయగడ్ - గుంటూరుమధ్య రైళ్లను రద్దు చేసింది. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్ళించిది . వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం చుట్టూ  తుఫాను గులాబ్ ఆదివారం ఉదయం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో 270 కిలోమీటర్లు, తూర్పు ఆగ్నేయంలో  గోపాల్ పూర్- కళింగపట్నానికి తూర్పున 330 కిలోమీటర్ల దూరంలో ఇది కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: