జనసేన ఆవిర్భావం వెంటనే చేసిన తప్పిదం ఆ పార్టీని ఇప్పటికి కోలుకోనివ్వడం లేదు. అయినా కనీసం ఈ కారణం కూడా గుర్తించలేక ఇంకా అదే తప్పును కొనసాగిస్తూ సేనాని పార్టీని ఊబిలోకి నెడుతూనే ఉన్నాడు. సేన ఆ ఊబిలో చిక్కుకొని ఊపిరి ఆడకుండా విలవిలలాడుతున్నారు. ఇవన్నీ పట్టవన్నట్టే సేనాని తన లేనిపోని పట్టుదలను వదిలిపెట్టడంలేదు. అయితే ఇక్కడ వదిలితే ఒక చావు, వదలకపోతే ఒక చావు అన్నట్టే పరిస్థితులు పీకమీదకు వచ్చేశాయి. అంటే ఇప్పటికే ఇతర పార్టీలు జనసేన అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది కానీ ఒక్కదానితో కూడా సరిగ్గా ఉండలేకపోతుంది అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలిని వదిలేస్తే ఒక చావు, వదలకపోతే ఆయనే మునిగిపోతున్నాడు. ఇది సేనాని నిజమైన పరిస్థితి.

తన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేదు, ఒకసారి అప్పుడే వెన్నుపోటు పొడిపించుకున్నాడు, ఇక ఎవరిని నమ్మాలన్నా ఆచి తూచి వ్యవహరించాల్సి వస్తుండటంతో ఎవరిని దగ్గరకు రానీయడం లేదు. తానే ఈ పరిస్థితికి పార్టీని దిగజార్చుకున్న విషయం ఆయనకు అర్ధం అవుతుండొచ్చు, కానీ బయటపడితే చిన్నతనంగా ఉంటుందనే కారణం తో నలిగిపోతున్నాడు. అందుకే ఎప్పుడూ లేని అసహనానికి గురవుతూ అదే ఆయా పరిస్థితులలో వెళ్లగక్కుకుంటున్నాడు. అంతకన్నా తాను చేసేది లేక, రాజకీయాలకు కొత్త కదా, మిన్నకుంటున్నాడు.  

అయినా లోకం కోసం పాత ప్రేమికురాలితో లేని ప్రేమను నటించాల్సి వస్తుంది. వదిలితే వదిలేశాడు అంటారు, లేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతుంది. ఈ పరిస్థితికి ఆ పార్టీని తేవడానికే ఆయన ప్రియురాలు ఎప్పుడో ఆ పార్టీ ఆవిర్భావం రోజే ప్రణాళిక వేసుకున్న విషయం మనోడికి తెలియక పప్పులో కాలు వేసి, కమిలిపోయిన కాలికి మందు రాసుకుంటూ సరిపెట్టుకుంటున్నాడు. ఎవరి ఖర్మానికి ఎవరు బాద్యులు అంటూ తన పరిస్థితికి తానే సిగ్గుపడుతూ, ప్రేమను కొనసాగిస్తాను అంటూ బాహాటంగానే వాపోతున్నాడు. ఏమైనా చరిత్రలో ఇన్ని వెన్నుపోట్లు పొడిచిన ప్రియురాలు ఇంకెక్కడా ఉండదేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ప్రియురాలు అంటే నీకు అర్ధం అవుతుందా!

మరింత సమాచారం తెలుసుకోండి: