
కొమ్మినేని శ్రీనివాస్ ఈ విషయం పైన డెబిట్ లో కృష్ణంరాజు వ్యాఖ్యలు మాట్లాడింది తప్పే అని చెప్పినప్పటికీ కూడా తనమీద కేసుని ఫైల్ చేసి మరి పోలీసుల అరెస్టు చేశారు. ఇక ఈరోజు కూడా ఏలూరులో నిరసనలు కొనసాగిస్తూ ర్యాలీలు కొనసాగిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు సాక్షి ఆఫీస్ కి నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులో ఉండే ఫర్నిచర్, సోఫాలు కూడా పూర్తిగా కాలిపోయాయని పార్కింగ్లో ఉండే కారు కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది.
కొంతమంది టిడిపి నేతలు కక్షపూరితంగానే చేసినట్లుగా వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అక్కడ నేతలు చెబుతూ ఉన్నప్పటికీ కేవలం తాము శాంతియుత ర్యాలీలనే నడుపుతున్నామని కావాలని కొంతమంది మాపైన నిందలు మోపుతున్నారంటూ టిడిపి వివరణ ఇస్తోంది. అయితే ఈ వివాదం పైన ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు కూడా స్పందించారు. అయితే వారు స్పందించిన తీరిక ఇలా చేసి ఉంటారని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.
అమరావతి మహిళలను గురించి కించపరుస్తూ సాక్షి ఛానల్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ కూడా సీరియస్గా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలను NCW తీవ్రంగా ఖండించింది. మరి ఈ వ్యవహారం పైన రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి.