ఇది నిజమే!. తరచుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఉంటే తప్ప.. నాయకులకు పెద్దగా పనిలే దన్నది కూడా వాస్తవమే. అదేసమయంలో ఒక్కొక్కరికి రెండేసి పదవులు ఇవ్వడం.. వారికే అన్ని బాధ్యత లు అప్పగించడం కూడా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అసంతృప్తి పెంచుతోంది. కొన్ని చోట్ల జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలుగా ఒక్కరే ఉన్నారు. ఇక, పల్లా శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేగా రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీదక్కించుకున్న పల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు.
కానీ, సాధ్యం కాకపోవడంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చారు. ఈ విషయాన్ని చెప్పడంలో.. పార్ట నాయకులను మెప్పించడంలో అధిష్టానం వెనుకబడింది. దీంతో ఆ పదవిని ఆశించిన సీనియర్లు.. ఎమ్మె ల్యేలు కాని వారు.. తమ సమయం కోసం వేచి చూస్తున్నారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలే జిల్లాల అధ్యక్షు లుగా ఉన్నారు. ఇది కూడా.. పార్టీలో ఇబ్బందిగా మారింది. తామంతా ఖాళీగా ఉన్నామని.. తమకు అవకాశం ఇవ్వాలని వారు కొన్నాళ్లుగా కోరుతున్నారు. వీరిలో గత ఎన్నికల్లో పార్టీకోసం పనిచేసిన వారు కూడా ఉన్నారు.
మరోవైపు.. ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని.. వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. కానీ, ఎమ్మెల్యేలు.. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను.. వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారన్న వాదన ఉంది. ఇది పార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తోంది. ఈ విషయం ఇటీవల చంద్రబాబు వరకు వచ్చింది. వెంటనే స్పందించిన ఆయన నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలు పంపిన జాబితాను పక్కన పెట్టారు. సో.. మొత్తానికి రెండేసి పదవులతో పాటు.. కొత్త నేతలను ప్రోత్సహిస్తున్నారన్న వాదనను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి