ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో ఎన్నో అంచనాలతో కప్ సాధిస్తుందని నమ్మిన టీం ఇండియా వరుస మ్యాచ్ లలో దారుణ పరాజయాలతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ రెండు ఓటములపై టీం ఇండియా ప్లేయర్స్, కోట్లాది మంది అభిమానులు మరియు టీం యాజమాన్యం అంతా కూడా ఎంతో బాధ పడ్డారు. క్రికెట్ లో ఇండియా ఎప్పుడూ శిఖరాన ఉంటుంది, అలాంటిది ఎంతో ప్రఖ్యాత గాంచిన ప్రపంచ కప్ లో వరుస మ్యాచ్ లు ఓడిపోవడంతో అందరూ చులకనగా చూడడం ప్రారంభించారు. ముఖ్యంగా పాకిస్తాన్ సీనియర్ల మన ఓటమిపై సెటైర్లు వేయడం జీర్ణించుకోలేకపోయారు. ఇండియాపై మన వాళ్ళు సైతం విమర్శలు చేశారు.

కేవలం ఐపీఎల్ కోసమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ప్లేయర్లు అలిసిపోయారు అంటూ స్వయంగా బుమ్రానే మీడియా ముందు చెప్పాడు. ఇంకా ఓటమికి గల కారణాలను చాలా చెప్పారు. కోహ్లీ ఆడలేదు కెప్టెన్సీ బాగాలేదు, ఓపెనర్స్ వైఫల్యం, బౌలింగ్ బాగాలేదు అంటూ రకరకాల కారణాలను చెప్పారు.  కానీ వాస్తవంగా చూస్తే టీం ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం అసలైన ఆల్ రౌండర్ లు జట్టులో లేకపోవడమే అన్నది ఈ ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న జట్లు ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లను ఒకసారి పరిశీలిస్తే వారికి మంచి నైపుణ్యం కలిగిన ఆల్ రౌండర్లు ఉన్నారు. ఒక్కో జట్టులో 9 వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉండడం కారణంగానే వారు విజయాలను సాధిస్తున్నారు.

కానీ ఇండియా పరిస్థితి చూస్తే అలా లేదు. హార్దిక్ పాండ్య మరియు జడేజా తప్పించి వేరే ఆల్ రౌండ్ లేడు. పైగా హార్ధిక్ పాండ్య సైతం బౌలింగ్ లో పూర్తిగా తేలిపోతున్నాడు. ఇక జడేజా కూడా ఆకట్టుకునే స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అందుకే ఇండియా టాప్ ఆర్డర్ విఫలమైతే లోయర్ ఆర్డర్ లో ఆదుకొనే ఆల్ రౌండర్ లు లేరు. అందుకే ఇండియావరల్డ్ కప్ లో ఆకట్టుకోలేకపోయింది. మరి భవిష్యత్తులో అయినా బీసీసీఐ ఆల్ రౌండర్ లను తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: