గణపతి  సర్వ గణాలకు అధిపతి. కొంత మంది హిందువులు వారు నమ్మిన దేవుళ్లను ప్రత్యేకించి పూజిస్తుంటారు. కులదైవం ఎవరైనా.... హిందువుల ప్రతి ఇంటిలోనూ కొలువై ఉండే దేవుడు గణేశుడు. ఆ విఘ్నేశ్వరుని మొత్తం 32 రకాల పేర్లతో  పిలుస్తుంటారు అని ప్రతీతి. గజకర్ణ, లంబోదర, వికాత్,సుముఖ, కపిల, బాల గణపతి,  ధుంధి గణపతి, దుర్గా గణపతి, ద్విజ గణపతి, ద్విముఖ గణపతి,భక్తి గణపతి, ఏకదంత గణపతి, ఏకాక్షర గణపతి, హరిద్ర గణపతి, హీరాంబ గణపతి, క్షిప్ర గణపతి, నృత్య గణపతి,మహా గణపతి,  క్షిప్ర ప్రసాద గణపతి, లక్ష్మీ గణపతి,  ఇలా పలు పేర్లతో ఆ గణేశుడిని ఆరాధిస్తుంటారు.

కొత్తగా ఏ పని లేదా కార్యక్రమం ప్రారంభించినా  తొలుతగా  ఆ విఘ్నేశ్వరునికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది మన శాస్త్రాలు చెబుతున్న ప్రతిష్టాత్మక విషయం. ఆయనను ధ్యానం చేయకుండా..ఏ దేవుడిని కొలిచినా ఫలితం శూన్యం అని చెబుతుంటారు. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందితే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ పని సక్రమంగా  విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతారు. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు 'ఋగ్వేదం' చెబుతోంది. గజ ముఖ గణపతి అన్ని దోషాలను తొలగించి.. మనం చేపట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతం అయ్యేలా ఆశీర్వదిస్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయి.

అలా అని వినాయకుడికి పూజ చేయకుండా పని మొదలు పెడితే ఖచ్చితంగా ఆటంకాలెదురవుతాయి అని చెప్పలేము కానీ.... అయితే ఏ పనైనా మొదలు పెట్టేముందు ఆ వినాయకుని ధ్యానించడం లేదా పూజించడం ఎంతో మంచిది. తద్వారా ఆ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుంది అన్నది మన నమ్మకం. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వినాయక చవితికి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వీధి వీధి కి విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు జరుపుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: