సొంత గడ్డపై టీమిండియా అదరగొడుతుంది అనుకుంటే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటింగ్ లో అదరగొట్టి 208 పరుగులు చేసిన టీమిండియా గెలవడం ఖాయం అనుకుని దీమాగా ఉన్న సమయంలో బౌలింగ్లో చెత్త ప్రదర్శన కారణంగా చివరికి టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీమిండియా కేవలం కొంత మంది ఆటగాళ్ల ప్రదర్శన మీద ఆధారపడి ఉంది అన్నది మాత్రం మరోసారి నిరూపితమైంది. మొన్నటికి మొన్న జట్టులో చిలక ఆల్ రౌండర్ గా జడేజా లేకపోవడంతో ఆసియా కప్లో చేతులెత్తేసింది టీమిండియా. ఇక ఇటీవలే జట్టులో జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక బౌలర్లు లేకపోవడంతో మరోసారి గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోయింది అని చెప్పాలి. టీమిండియాను విజయతీరాలకు నడిపిస్తారు అనుకున్న హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ లు పరుగులు సమర్పించుకున్నారు తప్ప ఎక్కడ టీమిండియాకు ఉపయోగపడే బౌలింగ్ మాత్రం చేయలేకపోయారు.  టి20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేయడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


 ఈ క్రమంలోనే టీమిండియాను ఆదుకునే ఒకే ఒక్క వీరుడు జస్ప్రిత్ బూమ్రా మాత్రమే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు అభిమానులు.  అతను జట్టులోకి వచ్చాడు అంటే చాలు టీమిండియాకు తిరుగు ఉండదు అని భావిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే త్వరగా కోలుకొని జస్ప్రిత్ బూమ్రా జట్టులోకి రావాలని కోరుకుంటూ ఉండటం గమనార్హం. జస్ప్రిత్ బూమ్రా కు అర్షదీప్ తోడైతే ఇక టీమిండియాను నన్ను వెంటాడుతున్న డెత్ ఓవర్ల సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉందని కామెంట్లు చేస్తున్నారు ఎంతోమంది అభిమానులు. అంతే కాకుండా తర్వాత మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన  ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: