
ఇక అక్టోబర్ 1వ తేదీన ప్రధాన నరేంద్ర మోడీ ఈ 5జి సేవలను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాయని టెలికాం దగ్గర సంస్థ రిలయన్స్ జియో అధినేత తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలలోనే ఈ 5జి మొబైల్స్ ఉంటాయని రిలయన్స్ జియో తెలియజేశారు. ఇప్పటికే 4 జి మొబైల్స్ ను తీసుకు రావడంలో సక్సెస్ ఫుల్ గా విజయవంతం అయ్యింది జియో సంస్థ. ఇప్పుడు తాజాగా 5జి మొబైల్ పైన ఫోకస్ చేసింది.
ఈ 5 జి మొబైల్ రూ.8000 వేల నుంచి రూ 12,000 ధరల లోపు ఉండే విధంగా ప్లాన్ చేస్తూ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కొరియా, చైనా, తైవాన్ తదితర కంపెనీలతో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు 4 జి నెట్వర్క్ గూగుల్ తో కలిసి అభివృద్ధి చేసిన జియో మొబైల్ ని.. రాబోయే రోజులలో 5 జి ఫోన్ల విషయంలో కూడా ఇలాంటి ఫీచర్లతోనే తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు రిలయన్స్ జియో సంస్థ. ఇక త్వరలోనే ఈ మొబైల్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుందని చెప్పవచ్చు.