క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల్లో ఇదే టెన్ష‌న్ ప‌ట్టుకుంది. మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్.. క్ర‌మంగా దేశ‌దేశాలు శ‌ర‌వేగంగా వ్యాప్తిచెంది అనేక మంది ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటుంది. ఈ క‌రోనా ముందు పేద‌.. ధ‌నిక అని భేదం లేదు. చిన్నా.. పెద్దా అని తేడా లేదు. ఎంత‌డి బ‌ల‌వంతుడైనా క‌రోనా ముందు త‌ల‌వంచాల్సిందే అన్నట్టు ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఉన్నాయి. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించాలంటే కేవ‌లం భౌతిక దూరం పాటించ‌డం మ‌రియు వ్య‌క్తిగ‌త శుభ్ర‌త మార్గాలుగా క‌నిపిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వాలు కూడా వీటి వైపే అడుగులు వేస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇక కరోనా పుణ్యమా అని ఏమీ జరగవనుకున్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. కరోనా ఎఫెక్ట్‌కి పలు సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలు సైతం ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్ హోమ్‌‌ ఇచ్చాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు ప్ర‌ధానంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య డేట‌. అయితే ఇలాంటి టైమ్‌లో రిలయెన్స్ జియో ఫైబర్ కనెక్షన్ ఉన్న‌వారికి గుడ్ న్యూస్ అందించింది జియో సంస్థ‌.

 

తాజాగా జియోఫైబర్ కాంబో ప్లాన్ ప్రకటించింది. రూ.199 కాంబో ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఏకంగా 1000 జీబీ డేటా ల‌భిస్తుంది. రూ.199 ప్లాన్ జీఎస్‌టీతో కలిపి రూ.234 చెల్లించాల్సి ఉంటుంది. రూ.199 ప్లాన్ ఉప‌యోగాలను ప‌రిశీలిస్తే వేలిడిటీ 7 రోజులు. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ వాడుకోవచ్చు. ఆ తర్వాత డేటా స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఉచిత వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా వాడుకోవచ్చు. మై జియో యాప్స్‌కు యాక్సెస్, ఉచిత ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ మాత్రం లేవు. దీన్ని కొత్త జియో ఫైబర్ కస్టమర్లతో పాటు పాత కస్టమర్లు కూడా ఈ ప్లాన్ వాడుకోవచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ మంచి అవ‌కాశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: