
వివరాల్లోకి వెళితే తేజస్విని సూసైడ్ నోట్ రాసుకొని ఆ తర్వాత ఇలాంటి దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు తెలుపుతున్న సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించి జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేశారట. తేజస్విని అనే మహిళ తన ఇద్దరు కుమారులను చంపి మరి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. అయితే ఇద్దరు కుమారులను కొబ్బరి బొండాల కత్తితో నరికి ఆ తర్వాత మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలియజేశారు.
కళ్ళముందే ఆడుతూ ఆనందంగా ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడంతో కుటుంబ సభ్యులకు కూడా కన్నీరు మున్నేరు అవుతున్నారు. తేజస్విని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో పిల్లలిద్దరికీ తరచూ అనారోగ్య సమస్యలు రావడంతో కుటుంబంలో కూడా చిన్నపాటి గొడవలు ఏర్పడ్డాయని పోలీసులు తెలియజేశారు. సహస్ర హైట్స్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తేజస్విని వెంకటేశ్వర్ రెడ్డి దంపతులకు ఆర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి అనే కుమారులు ఉన్నారు. తేజస్విని మానసిక స్థితి బాగా లేకపోవడంతో నిన్నటి రోజున సాయంత్రం నాలుగు గంటలకు తన ఇద్దరు కుమారులను కొడవలితో నరికేసింది. అయితే అక్కడికక్కడే ఆశీష్ రెడ్డి మృతి చెందగా ఆర్షిత్ రెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్న మధ్యలో మరణించారట. సంఘటన స్థలానికి చేరుకొని మరి పోలీసులు పరిశీలించగా.. ఐదు పేజీలో సూసైడ్ నోట్ బయటపడింది. ఈ ఘటనలో ఇంకా పోలీసులు విచారిస్తున్నారు.