ఇక భారతీయ మార్కెట్లో 'సిట్రోయెన్' (Citroen) కంపెనీ తన 'సి3' (C3) ఎస్‌యూవీని ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూసే కస్టమర్లకు కంపెనీ ఇప్పుడు గుడ్ న్యూస్ ని చెప్పింది. ఈ కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని వచ్చే నెల (జులై) 20 వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.ఇక అంతే కాకూండా బుకింగ్స్ కూడా జులై 01 నుంచి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది.ఈ సిట్రోయెన్ సి3 (Citroen C3) అనేది భారతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేయనున్న రెండవ మోడల్. ఇప్పటికే మార్కెట్లో సి5 ఎయిర్ క్రాస్ మంచి మంచి ప్రజాదరణ పొందుతోంది. కావున రానున్న ఇక ఈ కొత్త ఎస్‌యూవీ కార్ కూడా తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందే ఆకాశం ఉంటుంది.ఇక త్వరలో విడుదల కానున్న కొత్త సిట్రోయెన్ సి3 (Citroen C3) ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఈ 'సిట్రోయెన్ సి3' (Citroen C3) అనేది భారతదేశంలో ఉత్పత్తి కానున్న మంచి మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్.అలాగే భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి కూడా ఇదే.ఇక ఇది 2021 సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. అయితే ఇప్పుడు భారతీయ రోడ్లపైన తిరగడానికి కూడా ఇది సిద్ధంగా ఉంది.


ఇక ఈ సిట్రోయెన్ సి3 అనేది లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మొత్తం కూడా త్వరలోనే తెలుస్తుంది. సిట్రోయెన్ సి3 మంచి అద్భుతమైన డిజైన్ ని పొందుతుంది. ఇది డ్యూయల్ టోన్ రూఫ్ టాప్‌ ని కూడా కలిగి ఉందని తెలిసింది.ఈ సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.ఇక Citroen C3 ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇక ఇందులో మొత్తం 56 కస్టమైజేషన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇది దాదాపు 70 యాక్ససరీస్ ఆప్సన్ కూడా పొందవచ్చు. ఇది 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది, కావున ఆపిల్ కార్‌ప్లే ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇంకా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఈ ఎస్‌యూవీలో ఇవ్వనున్నారు. అలాగే సి3 ఇంటీరియర్‌లో రెండు కలర్ ఆప్షన్‌లు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: