సాధారణంగా అమ్మాయిలకు మూతి పైన, గడ్డం మీద చెంపలకు ఇరువైపులా తేలికపాటి ఎరుపు రంగులో వెంట్రుకలు వస్తూ ఉంటాయి.. వీటివల్ల అమ్మాయిలు అందంగా తయారవ్వాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ముఖం పైన , చంకలలో వచ్చే అవాంఛిత రోమాలను తొలగించాలి అంటే కేవలం రెండే రెండు పదార్థాలతో వాటిని ఇట్టే దూరం చేసుకోవచ్చు. అయితే ఆ పదార్థాలు ఏంటో మనం ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సాంకేతికత కూడా పెరుగుతోంది ఇక మహిళలకు మరింత సులభతరం అయిన పనులను చేకూర్చడానికి మార్కెట్లో రకరకాల క్రీములు , ఫేస్ మాస్క్ లు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు ఉపయోగించడం వల్ల ముఖం మీద వచ్చే అవాంచిత రోమాలను ఇట్టే దూరం చేసుకోవచ్చు.

తేనె , పంచదార:
తేనె మరియు పంచదార కలిపి ముఖం మీద వెంట్రుకలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల త్వరగా ఈ అవాంఛిత రోమాలు దూరమవుతాయి. డైరెక్ట్ గా తేనె మరియు పంచదార అప్లై చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఇందుకోసం మీరు ఒక టేబుల్ స్పూను చక్కెర, తేనే , నీళ్లు తీసుకొని మైక్రోవేవ్ లో పెట్టి చక్కెర పూర్తిగా కరిగే వరకూ ఉంచాలి. చిక్కటి ద్రవం లా తయారైనప్పుడు కొద్దిగా చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వెంట్రుకల మీద అప్లై చేయాలి. ఇది ఒక వ్యాక్స్  లా ఉపయోగపడుతుంది.


నిమ్మరసం , తేనె:
ఈ రెండు పదార్థాలను సమపాళ్లలో కలిపి ముఖం మీద ఎక్కడైతే చిన్నచిన్న తేలికపాటి వెంట్రుకలు వచ్చాయో అక్కడ అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది..


ఇక ఇవే కాకుండా నిమ్మరసం , చక్కెర ను  ఉపయోగించి కూడా ముఖం మీద వచ్చే అవాంచిత రోమాలను దూరం చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: