అమ్మాయి అయినా సరే ముఖ చర్మం తెల్లగా కనిపించడమే కాకుండా ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మం పొడిబారిపోవడం, ముడతలు వంటివి లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంతేకాదు కోమలమైన చర్మం పొందడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ అలసి పోతుంటారు. ముఖ్యంగా అమ్మాయి ముఖం కోమలంగా అనిపిస్తే వారు హీరోయిన్ల లాగా కనిపిస్తూ ఉంటారు అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ముఖచర్మం కాంతివంతంగా మెరవవాలి అంటే ఇప్పుడు చెప్పే చిట్కాను ఒకసారి పాటించి చూడండి.. అయితే ఆ చిట్కా ఏంటి ..? ఆ చిట్కా వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..ముఖానికి ఆవిరి పట్టడం:
అప్పట్లో అయితే చాలా మంది బయట ఎండలో పనిచేసే వాళ్ళు కాబట్టి ముఖానికి చెమట పట్టి చర్మం మీద ఉండే మలినాలు బయటకు వచ్చేవి.. కానీ ప్రస్తుతం అందరూ ఏసీల కింద పని చేస్తున్నారు కాబట్టి అమ్మాయిల ముఖం మీద వచ్చే మలినాలు బయటకు వెళ్లే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వేడినీటి ఆవిరి ని పట్టుకోవడం వల్ల ముఖం మీద ఉండే రంధ్రాలు ఓపెన్ అయితే అందులో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి.

పాల మీగడ:
పెరుగు మీగడ తో పోల్చుకుంటే పాల మీద వచ్చే మీగడ చాలా జిగురుగా ఉంటుంది. స్నానానికి గంట ముందు ముఖానికి అప్లై చేసి మర్దన చేస్తే.. స్నానం చేసిన తర్వాత కూడా ముఖం పొడిబారకుండా చాలా తాజాగా కోమలంగా కనిపిస్తుంది. వాతావరణంలో ఉండే గాలి, పొగ కాలుష్యం కారణంగా చర్మం మీద ఉండే సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పాలమీగడతో మర్దన చేయడం వల్ల ముఖం చాలా కోమలంగా కనిపిస్తుంది. ఇక పాలమీగడ అప్లై చేసి మర్దనా చేయడం వల్ల చర్మ కణాలకు రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మరింత ఆరోగ్యంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: