పొగరు వగరు కలబోసిన అందం ఆమె సొంతం. ఒకానొక సమయంలో స్టార్ హీరోలు కలిసి ఆమెను బ్యాన్ చేసినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెను నమ్ముకొని సినిమాలు చేసిన రోజులున్నాయి. బ్యూటీ ఎవరో కాదు సీనియర్ నటి జమున. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

జమున కర్ణాటకలోని హంపిలో మాధవ్ బ్రాహ్మణుడు, వ్యాపారవేత్త అయిన నిప్పని శ్రీనివాసన్ రావు, కౌశల్యదేవి అనే వైశ్య దంపతులకు 1936 ఆగష్టు 30న జన్మించింది. అప్పుడు ఆమెకు జన్ బాయి అని పేరు పెట్టారు. జమున మాతృభాష కన్నడ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో పెరిగింది. సావిత్రి దుగ్గిరాలలోనే ప్రదర్శన ఇచ్చినప్పుడు జమున ఇంట్లోనే ఉంది. ఆ చనువుతోనే సావిత్రి, జమున మధ్య అక్కాచెల్లెళ్ల చనువు, అనుబంధం ఏర్పడ్డాయి. తరువాత సావిత్రి జమునను సినిమాలలో నటించమని ఆహ్వానించింది.

జమున స్కూల్లో స్టేజ్ పెర్ఫార్మర్. ఆమె తల్లి జమునకు సంగీతం, హార్మోనియం నేర్పింది. డా. గరిపతి రాజారావు తన స్టేజి షో మా భూమిని చూసి 1952 లో ఆమె పుట్టిల్లు చిత్రంలో నటించడానికి ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె 14 సంవత్సరాల వయసులో హీరోయిన్‌గా సినిమాల్లోకి ప్రవేశించింది.

ఆమె నటించిన దొంగరాముడు, మిస్సమ్మ, చిరంజీవులు, ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, భూకైలాస్, ఇల్లరికం, గుండమ్మ కథ, బొబ్బిలి యుద్ధం, మూగ మనసులు, రాముడు భీముడు, మంగమ్మ శపథం, తోడూనీడా, పూలరంగడు, రాము, మట్టిలో మాణిక్యం, పండంటి కాపురం, దొరికితే దొంగలు, తాసిల్దార్ గారి అమ్మాయి వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు సరైన జోడిగా జమున ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే హరనాథ్, కృష్ణంరాజు, కృష్ణ వంటి హీరోలతోనూ జత కట్టింది.

తన అద్భుతమైన అభినయంతో పలు అవార్డులు సొంతం చేసుకున్న జమున ప్రొఫెసర్ జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. వారికి వంశీ, స్రవంతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్యాన్సిస్కో లో పని చేస్తున్నారు. శ్రవంతి కి పెళ్లయింది. కూతురు, మనవడి తో కలిసి ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జమున 1989 లో కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి లోక్ సభ నియోజకవర్గంకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1991 లో అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆపై బిజెపిలో చేరారు.

నటి, దర్శకురాలు, రాజకీయవేత్తగా రాణించిన జమునకు ఇండియా హెరాల్డ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: