మాస్ మహారాజా రవితేజ హీరోగా , భాను భోగవరపు దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం మాస్ జాతర. యంగ్ బ్యూటీ శ్రీ లీల మరొకసారి రవితేజతో జోడి కట్టింది. దీనిని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరోవైపు ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకోగా.. ఇటీవల విడుదలైన సాంగులో కూడా ఇడియట్ బీట్ పెట్టి అభిమానులను సర్ప్రైజ్ చేశారు చిత్ర బృందం. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర కూడా ఇందులో ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగానే సినిమాపై ఆయన చేసిన కామెంట్లు మరింత అంచనాలు పెంచుతున్నాయి.

నవీన్ చంద్ర ఇంటర్వ్యూలో భాగంగా మాస్ జాతర గురించి మాట్లాడుతూ.. "మాస్ జాతర సినిమా షూటింగ్ అయిపోవడానికి వచ్చింది. ప్రస్తుతం చివరి దశలో ఉంది.  చాలా రోజుల తర్వాత ఒక రైట్ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ తో నేను నటించాను. బెస్ట్ కమర్షియల్ ఫిలిం ఇదే. రవితేజ నీరు లాంటివారు. చాలా నిజాయితీగా ఉంటారు. అందరితో బాగుంటారు. దేనికి ఒత్తిడి తీసుకోరు. ఎవరినీ కంగారు పెట్టరు. ఆయన వర్క్ చూసుకుంటారు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. అటు ప్రొఫెషనల్ విషయంలో కూడా మరింత స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయన ఒక స్వీట్ హార్ట్" అంటూ చెప్పుకు వచ్చారు నవీన్ చంద్ర. ప్రస్తుతం నవీన్ చంద్ర చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నవీన్ చంద్ర ఇందులో నటిస్తున్నాడు అని తెలియడంతో ఈయన విలన్ పాత్ర పోషిస్తున్నారా? లేక మరేదైనా పాత్ర పోషిస్తున్నారా? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే సినిమాపై అంచనాలు పెంచేశారు నవీన్ చంద్ర.  మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: