బ్యూటీ కేతిక శర్మ గురించి పరిచయం అనవసరం. ఈ అందాల భామ తన అందాలతో నిత్యం కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ భామ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన రొమాంటిక్ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కేతిక శర్మ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ అంత పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాయి. ఈమె హీరోయిన్ గా నటించి అలసిపోయిందో ఏమో.. ఇటీవల విడుదలైన నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ భామ గుర్తింపు సాధించలేకపోయింది.

కేతిక శర్మకి అందం, అభినయం ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలో ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఈ భామ ఢిల్లీ నుండి సినిమాలలో నటించాలని కోరికతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈమె ఆకాశ్ పూరీతో రొమాంటిక్ సినిమా చేసింది కానీ విజయం సాధించలేదు. ఆ తర్వాత యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో అంగరంగ వైభవంగా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. హీరో నాగశౌర్యతో లక్ష్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది.  దీంతో ఈ బ్యూటీ కొంత గ్యాప్ తీసుకుని రాబిన్ హుడ్ సినిమా లో ఐటమ్ బ్యూటీ గా మారింది. అయినా హిట్ అందుకోలేకపోయింది. కేతిక శర్మ విజయ్ 69 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఈ భామకు నిరాశే మిగిలింది.

ఇదిలా ఉండగా ఈ అందాల భామ తాజాగా హిట్ అందుకుంది. సింగిల్ సినిమాతో కేతిక శర్మ ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మతో పాటుగా నటి ఇవానా కూడా నటించింది. ఈ సినిమాను డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించారు. మే 9న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో కేతిక శర్మ సినీ జీవితంలో ఈ సినిమా ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్ లు రాబోతున్నాయని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: