ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఏ వైపు నుంచి మనల్ని కబలించే మృత్యువు వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇక భారత సైనికులకు ఇది మరీ కాస్త ఎక్కువే అని చెప్పవొచ్చు.. ఎందుకంటే శత్రువులు ఎక్కడ నుంచి ఎటాక్ చేస్తారో తెలియదు.. ఎక్కడ ఏ బాంబు పేలుతుందో.. ఎక్కడ నుంచి గుండ్ల వర్షాలు కురుస్తాయో గమనించేలోగా ప్రాణాలు పోతుంటాయి. కానీ రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో
ఆర్మీ వాహనానికి ఊహించని ప్రమాదం జరగడంతో ఇద్దరు సైనికాధికారులు మృతి చెందారు.
శనివారం ఇద్దరు సైనికాధికారులు
ఆర్మీ వాహనంలో బీకనేర్-జైపూర్ రహదారిపై ప్రయాణిస్తుండగా టైర్ పేలింది. అనుకోకుండా టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనం బోల్తాపడటం అందులో ప్రయాణిస్తున్న కల్నల్
మనీష్ సింగ్ చౌహాన్, మేజర్ నీరజ్ శర్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఇద్దరిని పీబీఎం సైనికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సెరునా
పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అరుణ్
కుమార్ తెలిపారు.