
ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న నవాబ్గంజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులనూ విచారించగా అసలు విషయం బయటపడింది.అస్వస్థతకు గురైన కూతుర్ని అక్టోబరు 24న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు 6నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు. దీంతో అబార్షన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. గర్భం వచ్చేందుకు కారణమైన వ్యక్తి ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఆ యువతి సమాధానం చెప్పలేదు. విసుగు చెందిన తల్లిదండ్రులు ఆమెను నరికి చంపారు" అని నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ తెలిపారు.